Tillu Square Day16 BoxOffice: టిల్లు మామ 16 డేస్ కలెక్షన్స్..నాని బ్లాక్ బస్టర్ మూవీని బీట్ చేసిందిగా

Tillu Square Day16 BoxOffice: టిల్లు మామ 16 డేస్ కలెక్షన్స్..నాని బ్లాక్ బస్టర్ మూవీని బీట్ చేసిందిగా

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)లేటెస్ట్ మూవీ టిల్లూ స్క్వేర్ బాక్సాఫీస్ కల్లెక్షన్స్ తో దూసుకెళ్తోంది. డైరెక్టర్ మల్లిక్ రామ్ తెరకెక్కించిన టిల్లూ స్క్వేర్ మూవీ ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వచ్చేసింది. రిలీజైన మూడు రోజుల్లోనే లాభాల్లోకి రావడమంటే మాటలు కాదు.అంతలా హిట్ కొట్టాడు టిల్లు గాడు.

ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ వచ్చిన కూడా టిల్లు దూకుడిని ఆపలేకపోయాడు. మరి ఈ సినిమా ఇప్పటివరకు సాధించిన కలెక్షన్స్ ఎంత? జరిగిన బిజినెస్ ఎంత?బాక్సాఫీస్ వద్ద వచ్చిన లాభాలేంత? అనేది తెలుసుకుందాం. 

టిల్లు గాడు తెలుగు రాష్ట్రాలు మినహాయిస్తే..కర్ణాటకతోపాటు మిగతా రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.15 కోట్లు, ఓవర్సీస్ నుంచి రూ. 14.72 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు 16 రోజుల్లో కలిపి రూ. 65.28 కోట్ల షేర్ రాగా రూ. 115.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.టిల్లూ స్క్వేర్ రూ.28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగగా..చాలా తక్కువ రోజుల్లోనే టార్గెట్ ని దాటేసి ఇప్పటికీ రూ.37.28 కోట్ల లాభాలు వచ్చాయి.అయితే ఈ మూవీ ఇండస్ట్రీలో కలెక్షన్స్ సునామి తెచ్చిన కొన్ని సినిమాలను క్రాస్ చేసింది. 

అలా రీసెంట్‌గా బుచ్చిబాబు ఉప్పెన, నిఖిల్ కార్తికేయ 2 వంటి సినిమాల లాంగ్ రన్ కలెక్షన్స్‌ను బీట్ చేసి 60 కోట్ల క్లబ్‌లో చేరి శభాష్ అనిపించుకుంది.అంతేకాకుండా 15 రోజుల బాక్సాఫీస్ వసూళ్లతో మీడియం రేంజ్ సినిమాల్లో టాప్ 2 బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన నాని దసరా పేరు మీద ఉన్న మొత్తం కలెక్షన్స్‌ను బీట్ చేసింది. దీన్ని పరంగా చూస్తే సిద్ధూ మేనియా..ఇకపై దిమ్మ తిరిగే రేంజ్ లో మారుతుందని చెప్పటంలో అస్సలు సందేహమే లేదు.

ప్రసెంట్ సిద్దు చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులు వున్నాయి.ఈ రెండు ప్రాజెక్ట్ లకు పది కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది.