Tillu Square OTT Official: టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Tillu Square OTT Official: టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square). దర్శకుడు మల్లిక్ రామ్(Mallik Ram) తెరకెక్కించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్ గా నటించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

టిల్లు  ఓటీటీ

ఇదిలా ఉండగా..టిల్లు స్క్వేర్ సినిమా నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ నెల ఏప్రిల్ 26 నుంచి ఓటీటిలో స్ట్రీమింగ్ కాబోతుంది. రిలీజ్‌కు ముందే టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ మేరకు ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసింది.  

టిల్లు కలెక్షన్స్:

వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ.130 కోట్ల మార్కును దాటేసింది. “డబుల్ బ్లాక్‍బస్టర్ టిల్లు స్క్వేర్ కొత్త ల్యాండ్ మార్క్ చేరింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. ఇంత భారీ బ్లాక్‍బస్టర్ సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్స్” అంటూ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ పోస్ట్ చేసింది. తర్వాత వచ్చే టిల్లు క్యూబ్ మరింత భారీగా, బెటర్‌గా ఉంటుందంటూ కూడా తెలిపారు.

టిల్లు స్క్వేర్ కథ విషయానికి వస్తే..

మొదటి పార్టులో రాధిక చేతిలో మోసపోయిన టిల్లుకి ఒక పార్టీలో లిల్లీ పరిచయం అవుతుంది. ఆమె పరిచయం టిల్లు జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది? ఆ క్రమంలో టిల్లు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనేది మిగిలిన కథ. అదే కథను కాస్త ఎంటర్టైనింగ్ వేలో చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. టిల్లు స్క్వేర్ మూవీకి భీమ్స్ మ్యూజిక్ అందించాడు.డీజే టిల్లు హీరోయిన్ నేహాశెట్టి గెస్ట్ రోల్‌లో క‌నిపించింది.