
షాద్ నగర్, వెలుగు: రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలనకు బుద్ధి చెప్పే టైమొచ్చిందని షాద్ నగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వీరపల్లి శంకర్ తెలిపారు. మంగళవారం ఫరూఖ్‌నగర్ మండలంలోని దూసకల్, నాగులపల్లి, లింగారెడ్డి గూడ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు అందరూ రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆయన ఆరోపించారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. అనంతరం లింగా రెడ్డి గూడ గ్రామానికి చెందిన యువకులు వీర్లపల్లి శంకర్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రామిరెడ్డి, బాలరాజ్ గౌడ్, మహ్మద్ ఇబ్రహీం పాల్గొన్నారు.