సోషల్ మీడియా పుణ్యం : సరదా కోసం మొదలుపెట్టింది.. ఇప్పుడు లక్షాధికారి అయ్యింది

సోషల్ మీడియా పుణ్యం : సరదా కోసం మొదలుపెట్టింది.. ఇప్పుడు లక్షాధికారి అయ్యింది

ప్రస్తుత రోజుల్లో యువత సొంత వ్యాపారాల వైపే మొగ్గు చూపుతున్నారు. తమ కాళ్లపై తాము నిలబడేందుకే ఇష్టపడుతున్నారు. అంతే కాకుండా ఉద్యోగం చేస్తున్నప్పటికీ వ్యాపార కోణంలో ఆలోచనలు చేస్తూ సైడ్ బిజినెస్ లాంటివి చేస్తున్నారు. ఉద్యోగంలో ఉంటూనే సైడ్‌ ఇన్‌కమ్‌ కోసం సరికొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు.  కొంతమందికి  అవసరం లేకపోయినా టైమ్​ పాస్​ కోసం సైడ్​ బిజినెస్​ చేస్తుంటారు.  అలానే టైమ్​ పాస్​ బిజినెస్​ ఓ మహిళను లక్షాధికారిని చేసింది. 

 అమెరికాలోని మిస్సిస్సిప్పి లో నివసించే గెన్నా టాటు  మహిళ తన  తన సైడ్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి  రూ. 66.57 లక్షలు సంపాదిస్తోంది .  ఆమె ఓ కంపెనీలో  ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా ఫుల్​ టైమ్​ జాబ్​ చేస్తోంది. అయినా సరే  గెన్నా టాటు సరదాగా  ఊలుతో బొమ్మలు తయారు చేయడం మొదలు పెట్టింది. మొదట పిల్లి బొమ్మను తయారు చేసింది.  తరువాత  మనుషులు.. పొద్దుతిరుగుడు పువ్వులు, కొన్ని జంతువుల బొమ్మలను తయారు చేసి వాటిని అమ్మడం ప్రారంభించింది. వారంలో  20 గంటలు తాను బొమ్మలను తయారు చేస్తానని తెలిపింది.  రెండేళ్లలో గెన్నా టాటు తయారు చేసిన బొమ్మలకు మంచి గిరాకీ వచ్చింది. దీంతో  క్రోచెట్​ బై జెన్నా  అనే పేరుతో కంపెనీ ప్రారంభించింది.  రూ. 800 నుంచి 8 వేల రూపాయిల వరకు బొమ్మలను విక్రయించింది.  కస్టమర్ల ఇష్టం మేరకు ప్రత్యేక ఆర్డర్లు తీసుకొని బొమ్మలను తయారు చేస్తూ.. అమెరికాకు చెందిన గెన్నా టాటు  సైడ్​ బిజినెస్​ చేస్తూ లక్షాధికారి అయ్యారు.