కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందాం: పాక్ ఆర్మీ చీఫ్

కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందాం: పాక్ ఆర్మీ చీఫ్

ఇస్లామాబాద్: జమ్మూ కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందామని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా అన్నారు. పరస్పరం గౌరవించుకోవడానికి, శాంతియుత సహజీవనానికి పాకిస్థాన్ ఎప్పుడూ కట్టుబడి ఉందని బజ్వా స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో పాల్గొన్న బజ్వా.. జమ్మూ కశ్మీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ఏళ్లుగా రగులుతున్న జమ్మూ కశ్మీర్ సమస్యను భారత్-పాక్‌‌లు తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి. జమ్మూ కశ్మీర్ ప్రజల ఆకాంక్షల మేరకు ఈ మానవ ఉత్పాతానికి ముగింపును తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యను శాంతియుతంగా ఓ కొలిక్కి తీసుకురావాలి’ అని బజ్వా చెప్పారు. జమ్మూ కశ్మీర్ సమస్యపై ఎప్పుడూ వివాదాస్పద కామెంట్స్ చేసే బజ్వా శాంతియుతంగా ఇష్యూను పరిష్కరించుకుందామనడం ఆశ్చర్యంగా అనిపిస్తోందని డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై ఇప్పుడే కామెంట్ చేయలేమని, బజ్వా తన వైఖరిని మార్చుకున్నారని చెప్పలేమన్నారు.