మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వనపర్తి, వెలుగు:  ప్రభుత్వం ఇటీవల రేషన్ దుకాణాలకు పంపిణీ చేసిన టీఐపాస్ మెషీన్లు సరిగ్గా పనిచేయడం లేదని రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీలర్లు ఆరోపించారు. శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట నిరసన తెలిపి..  కార్యాలయ ఆఫీసర్లకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెషీన్లు తప్పుడు తూకం చూపుతున్నాయని వాపోయారు. దీంతో  తాము నష్టపోతున్నారని, వెంటనే వాటిని మార్చాలని డిమాండ్ చేశారు. లేదంటే 13న రేషన్ షాపుల బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీలర్ల సంఘం నాయకులు, బచ్చు రాము, అర్జునయ్య, నాగరాజు, రామస్వామి, నాగరాజు, జీవయ్య, రాములు, శంకర్ పాల్గొన్నారు.

కమనీయం కల్యాణం

అయిజ, మద్దూరు, వెలుగు:  అయిజ మండలం ఉత్తనూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెలసిన ధన్వంతరి వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని శుక్రవారం  కమనీయంగా నిర్వహించారు.  అంతకుముందు శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారికి వేద పండితులు  అర్చన, అభిషేకం, ఆకుపూజ, హోమం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను రథంపై ఉంచి దశమికట్ట వరకు ఊరేగించారు.  అలాగే పేట జిల్లా మద్దూరులో చౌడేశ్వరి దేవి వార్షికోత్సవాల్లో భాగంగా  భక్తులు అఖండ జ్యోతిని వెలిగించి బుట్టల్లో పుర వీధుల్లో ఊరేగించారు.  అనంతరం ఆలయానికి చేరుకొని  అమ్మవారిని పట్టువస్త్రాలు, పూలతో అలంకరించి  పూజలు చేశారు.

స్కాలర్ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దరఖాస్తు చేసుకోండి

వనపర్తి టౌన్, వెలుగు: 2022–-23 విద్యా సంవత్సరానికి వివిధ కాలేజీల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఫ్రెష్, రెన్యువల్ విద్యార్థులు ఈ నెల15వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ లోగా స్కాలర్ షిప్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నుశిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  స్టూడెంట్లు నిర్ణీత గడువులోగా తమ వివరాలను ఈ - పాస్ వెబ్ సైట్ http://telanganaepass.cgg.gov.in లో నమోదు చేసుకోవాలని కోరారు.  

పేదలను మోసం చేస్తున్న సర్కారు

గద్వాల, వెలుగు:  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను మోసం చేస్తున్నాయని, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే వారికి న్యాయం జరుగుతుందని డీసీసీ ప్రెసిడెంట్ పటేల్ ప్రభాకర్ రెడ్డి అన్నారు.  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో చేపట్టిన స్వాతంత్ర్య గౌరవ పాదయాత్ర శుక్రవారం ధరూర్ మండలం నుంచి  మల్దకల్ మండలానికి చేరుకుంది.  ఈ సందర్భంగా ప్రజలు, రైతుల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. బీజేపీ, టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయాంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయని, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మద్దతిస్తే ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నేతలు బలిగేర నారాయణరెడ్డి, శంకర్ తత్తర పాల్గొన్నారు.

చిన్నారి చికిత్సకు రూ.7 లక్షల ఎల్వోసీ

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: క్రానిక్ లివర్ ఫెయిల్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బాధపడుతున్న నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డుకు చెందిన రాజు, నందినీ దంపతుల ఆరేళ్ల కూతురు ఆకాంక్షకు ఎమ్మెల్యే జనార్ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి అండగా నిలిచారు.  పాప చికిత్స కోసం రూ.25 లక్షల ఖర్చవుతుందని డాక్టర్లు సూచించడంతో అంత స్థోమత లేని వాళ్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.  విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాప పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం క్యాంప్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పిలిపించి రూ.7 లక్షల ఎల్వోసీ ఇచ్చారు. పాపకు హైదరాబాద్ ప్రతిమ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఆపరేషన్ చేయించాలని ,  పూర్తిగా నయం అయ్యేవరకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

వీఆర్ఏల సమస్యలపై  సీఎం స్పందించాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వీఆర్ఏల సమస్యలపై  సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పందించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వీఆర్ఏ సమ్మె శిబిరం వద్ద అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎం వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు.  పేస్కేల్ అమలు చేయడంతో పాటు ప్రమోషన్లు, వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటయ్య, కాంగ్రెస్ నాయకులు నిజాం, జనసేన నాయకులు కురుమయ్య, బీఎస్పీ పార్టీ నాయకుల పృథ్వీరాజ్, వైఎస్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీపీ పార్టీ నాయకులు హుస్సేన్,  వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్ పాల్గొన్నారు.  

ఆర్థిక మంత్రి ఫొటోకు రాఖీ కట్టి నిరసన 

మద్దూరు , వెలుగు:  తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మద్దూరు మండల వీఆర్ఏలు  ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రావు ఫోటోకు  రాఖీ కట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 రోజులుగా సమ్మె చేస్తున్నా  సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టించుకోవడం లేదని వాపోయారు. తాము కొత్త కోరికలు కోరడం లేదన్నారు.  ఈ కార్యక్రమంలో వీఆర్ఏల జేఏసీ చైర్మన్ లక్ష్మప్ప , కో కన్వీనర్ సత్తప్ప, వీఆర్ఏలు మొగులప్ప, రాములు, కేశవులు, కాంతు, బసప్ప, పుల్లప్ప  పాల్గొన్నారు.