జుట్టు రాలడం తగ్గించే చిట్కాలు ఇవే..

జుట్టు రాలడం తగ్గించే చిట్కాలు ఇవే..

వాతావరణంలోని కాలుష్యం, మానసిక ఒత్తిడి వల్ల చిన్న వయస్సులోనే తల వెంట్రుకలు రాలడం చాలా మందిలో జరుగుతూ ఉంటుంది. అయితే… ఈ సమస్యకు ఇంట్లోనే చేసుకునే చక్కని పరిష్కారాలను సూచిస్తున్నారు నిపుణులు.

1.ఉసిరి..
జుట్టు సంబంధమైన సమస్యలకు ఉసిరి బాగా ఉపయోగపడుతుంది. ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు వెంట్రుకలను ఉడిపోనీయకుండా చేస్తాయి. దీంతో పాటు చుండ్రు, నెత్తి మంటను కూడా తగ్గిస్తాయి. ఉసిరి పోడిని తలకు తరచూ పెట్టుకోవడంవల్ల కురులు మెరుస్తూ దృడంగా ఉంటాయి.

2.బీట్ రూట్ జ్యూస్
జుట్టు రాలడాన్ని నివారించడంలో బీట్ రూట్ ముందుంటుంది. ప్రతీ రోజు తీసుకునే ఆహారంలో గానీ.. భోజనం తరువాత గానీ ఒక గ్లాసెడు బీట్ రూట్ జూస్ ను తీసుకుంటే కుదుళ్లు గట్టిపడి వెంట్రుకలు ఊడకుండా ఉంటాయి.

3.వేడినూనెతో మసాజ్
మసాజ్ తో ఎంతటి అలసటైనా చిటికెలో మాయం అవుతుంది. దీంతో పాటే డెడ్ సెల్స్ కూడా ఆక్టీవ్ అయిపోతాయి. వెంట్రుకలు కూడా రాలిపోవడం ఆగిపోతుంది. స్వచ్చమైన కొడ్డరి నూనెను కొంచెం వేడి చేసి.. రాత్రి పడుకునే ముందు తలకు పెట్టుకుని మునివేళ్లతో మెల్లిగా మర్ధన చేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల కుదుళ్ల లోని రక్తప్రసరణ పెరిగి జుట్టు రాలడం తగ్గుతుంది.

4.ఉల్లిగడ్డ జ్యూస్..
ఉల్లి లో ఉండే సల్ఫర్  జుట్టుకు బలాన్ని ఇస్తుంది.. ముందుగా ఉల్లి గడ్డలను తీపుకుని జూస్ చేయాలి.. అందులో వచ్చిన మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఇలా తరచూ చేస్తే.. వెంట్రుకలు రాటడం ఆగిపోతుంది. దీనివల్ల తలలో ఉండే సూక్ష్మ జీవులు నశిస్తాయి.

5.గ్రీన్ టీ..
ప్రతీ రోజు గ్రీన్ టీ తాగడం వలన వెంట్రుకలకు కండీషనర్ లా ఉపయోగపడుతుంది. దీంతో పాటు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. గ్రీన్ టీ సొల్యూషన్ ను తలకు రాయడం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి.