ఈ వేసవిలో మధుమేహం ఉన్న వాళ్లు పాటించాల్సిన చిట్కాలు

ఈ వేసవిలో మధుమేహం ఉన్న వాళ్లు పాటించాల్సిన చిట్కాలు

వేసవి ప్రారంభం అయింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున మధుమేహం ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతలు వారి రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. అంతేకాదు డీహైడ్రేషన్ తో ప్రమాదం కూడా రావచ్చు. ఫలితంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

హీట్ వేవ్ సమయంలో సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండటానికి చిట్కాలు:

హైడ్రేటెడ్ గా ఉండండి: డీహైడ్రేషన్ ఎవరికైనా ప్రమాదకరమే. కానీ మధుమేహం ఉన్నవారికి ఇది అత్యంత ప్రమాదకరం. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, శరీరం మూత్రం ద్వారా ఎక్కువ ద్రవాలను కోల్పోతుంది. ఇది నిర్జలీకరణానికి దారితీస్తుంది. మీకు దాహం వేస్తుందా లేదా అనే దానితో సంబంధం లేకుండా రోజంతా తగినంత మొత్తంలో నీటిని తీసుకోవడం ద్వారా హైడ్రేటెడ్‌గా ఉండవచ్చు.

మీ మందులను చల్లగా ఉంచుకోండి: వేడి ఇన్సులిన్, ఇతర మధుమేహ ఔషధాల శక్తిని ప్రభావితం చేస్తుంది. మీరు ఎక్కువ సమయం బయట ఉండాల్సి వస్తే.. మీరు వాడే మెడిసిన్  కూలింగ్ లేదా ఇన్సులేట్ బ్యాగ్ వంటి చల్లని ప్రదేశంలో ఉంచుకోవడం మర్చిపోకండి.

మీ రక్తంలో షుగర్ లెవల్స్ ను తరచుగా చెకే చేస్తూ ఉండండి: మధుమేహం ఉన్న వారిలో రక్తం చక్కెర స్థాయిలను హెచ్చుతగ్గులకు గురి చేస్తుంది. కాబట్టి ఆ స్థాయిలను మామూలుగా చేసే దాని కంటే తరచుగా చెక్ చేస్తూండడం చాలా ముఖ్యం. మీ రక్తంలో చక్కెర స్థాయిలలో ఏమైనా మార్పు కనిపిస్తే వెంటనే మీ ఇన్సులిన్ లేదా మందుల డోసులను ఛేంజ్ చేసుకోవచ్చు.

లేత-రంగు, వదులుగా ఉండే దుస్తులను ధరించండి: ముదురు రంగు దుస్తులు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. ఇది మీకు వేడిగా అనిపించేలా చేస్తుంది. వదులుగా ఉండే దుస్తులు మీ శరీరం చుట్టూ గాలి ప్రసరించేలా చేస్తాయి. ఇది మిమ్మల్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.

సూర్యరశ్మికి ఎక్కువసేపు  ఉండకండి: ప్రత్యక్ష సూర్యకాంతి మీ శరీర ఉష్ణోగ్రత త్వరగా పెరగడానికి కారణమవుతుంది. ఇది అలసట లేదా హీట్ స్ట్రోక్‌కు దారితీస్తుంది. వీలైనంత వరకు నీడ ఉన్న ప్రదేశాలలో ఉండటానికి ప్రయత్నించండి. సూర్యుని నుంచి మీ ముఖం, కళ్ళను రక్షించడానికి టోపీ, సన్ గ్లాసెస్ ధరించండి.

ఎయిర్ కండిషన్ చేయబడిన ప్రదేశాలలో విరామం తీసుకోండి: మీరు ఆరుబయట ఉండాల్సి వస్తే.. ఎయిర్ కండిషన్డ్ భవనాలు లేదా వాహనాల్లో విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. డీహైడ్రేషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఏమైనా పనులుంటే వాతావరణ చల్లబడాకే ప్లాన్ చేయండి: రోజులో అత్యంత వేడిగా ఉండే సమయంలో వ్యాయామం చేయడం లేదా కఠినమైన కార్యకలాపాలు చేయడం మానుకోండి. దానికి బదులుగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఉదయాన్నే లేదా సాయంకాలం బయటికెళ్లి పనులు చేసుకునేలా ప్లాన్ చేసుకోండి.