
పోయిన నెంబర్లను తిరిగి పొందాలంటే.. ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే ముందుగా సెట్టింగ్స్‌కు వెళ్లాలి. అందులో గూగుల్ ఆప్షన్ ఎంచుకుని గూగుల్ అకౌంట్ మేనేజ్మెంట్పై ట్యాప్ చేయాలి. తర్వాత పీపుల్ అండ్ షేరింగ్ ఆప్షన్ ఓపెన్ చేసి కాంటాక్ట్స్‌కి వెళ్లాలి. ఏదైనా బ్రౌజర్లో contacts.google.com ఓపెన్ చేసి గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి. గూగుల్‌తో అప్డేట్ చేసిన పాత నెంబర్లన్నీ కనిపిస్తాయి. అవి డిలీట్ అయి ఉంటే మెనూకి వెళ్లి undo changes సెలక్ట్ చేయాలి. అవసరమైతే కస్టమ్ తేదీ సెట్ చేసి మరీ కాంటాక్ట్‌లను తిరిగి పొందొచ్చు. ఐఫోన్లో అయితే ముందుగా icloudతో అప్డేట్ చేయాలి.
ఆపై ఐఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆపిల్ ఐడీపై ట్యాప్ చేయాలి. అందులో ఐక్లౌడ్‌కి వెళ్లి కాంటాక్ట్స్ స్విచ్ని టోగుల్ చేయాలి. అప్పటికే ఆన్ ఉంటే నెంబర్లు ఫోన్లో ఆటోమెటిక్‌గా కనిపిస్తాయి. ల్యాప్ ట్యాప్ లేదా బ్రౌజర్లో icloud.com ఓపెన్ చేసి ఆపిల్ ఐడీతో లాగిన్ చేయాలి. తర్వాత అకౌంట్ సెట్టింగ్స్‌కు వెళ్లి ఆపై కాంటాక్ట్‌ను రీస్టోర్ ఆప్షన్ ఎంచుకోవాలి.
►ALSO READ | వైఫై స్లోగా ఉందా.. ఈ టిప్స్ ఫాలో అయితే.. డబుల్ స్పీడ్ గ్యారెంటీ..
అంతేకాదు... ట్రూకాలర్ యాప్ వాడే యూజర్లకు బ్యాకప్ చాలా ఈజీ. ఎందుకంటే నెంబర్లు అందులో కూడా సేవ్ అయి ఉంటాయి. ట్రూకాలర్ లాగిన్ చేసి బ్యాకప్ ఆప్షన్ ఆన్‌లో ఉంటే వెంటనే కాంటాక్ట్ లిస్ట్ రీస్టోర్ చేసుకోవచ్చు. అలాగే మెసేజ్ యాప్‌లో కూడా ఎప్పుడైనా ఎస్ఎంఎస్లు వాడి ఉంటే అక్కడ కూడా కాంటాక్ట్స్ చూడొచ్చు.