Tirumala : తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం

Tirumala : తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం

తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. మార్చి 11వ తేదీ ఉదయం తిరుపతి నుంచి తిరుమల వెళుతున్న ఆర్టీసీ బస్సు.. మోకాళ్ల పర్వతం దగ్గర.. ముందు వెళుతున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనక భాగం దెబ్బతినటంతోపాటు.. కారులో నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి.

ఈ ప్రమాదంలో మొదటి ఘాట్ రోడ్డులో వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదం జరిగిన మోకాళ్ల మిట్ట నుంచి తిరుమల జీఎన్సీ టోల్ గేట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డు మధ్యలో ప్రమాదం జరగటంతో.. ఎక్కడిక్కడ వాహనాలు ఆగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన కారును, ఆర్టీసీ బస్సున పక్కకు తీసి.. ట్రాఫిక్ క్లియర్ చేశారు. సుమారు గంట తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయ్యిందని.. ప్రమాదంలో గాయపడిన కారులో వ్యక్తులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ప్రకటించారు తిరుమల అధికారులు. ప్రస్తుతం మొదటి ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలు సాగుతున్నాయని.. ప్రమాదం జరిగిన ప్రదేశంలో స్లోగా వెళుతున్నాయని చెబుతున్నారు అధికారులు.