తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..2 గంటల్లో దర్శనం

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..2 గంటల్లో దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.  సంక్రాంతి పండగకు అంతా సొంతూళ్లకు వెళ్లడంతో భక్తుల రద్దీ లేదు.  దీంతో క్యూలైన్లు దాదాపుగా ఖాళీగానే కనిపిస్తున్నాయి. దీంతో భక్తులకు వెయిట్ చేయకుండానే స్వామి వారి దర్శనం చాలా ఈజీగా జరిగిపోతుంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.  

తిరుమల శ్రీవారిని 2024 జనవరి జనవరి 13 శనివారం రోజున  65 వేల 692 మంది దర్శించుకున్నారు.  24,575  మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.78 కోట్లు ఆదాయం వచ్చినట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు. 

మరోవైపు తిరుమలలో భోగీ సంబరాలు మొదలయ్యాయి.   తిరుప‌తి శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో వద్ద టీటీడీ అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తులు భోగి మంట వేశారు. భోగీ పండుగ సందర్భంగా సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహిస్తారు.