సిగరెట్తో ట్రైన్ తగలబెట్టిండు

సిగరెట్తో ట్రైన్ తగలబెట్టిండు

తిరుమల ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి తిరుపతి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కోచ్ నెంబర్ 6లో గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ తాగి పడేయడంతో మంటలు చెలరేగినట్లు సిబ్బంది చెబుతున్నారు. 

ప్రమాదం జరిగిన సమయంలో కోచ్ లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు అంటుకున్న విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు.