తిరుమలలో మళ్లీ ప్రమాదం... కారు, స్కూటీ ఢీ

తిరుమలలో మళ్లీ ప్రమాదం... కారు, స్కూటీ ఢీ

తిరుమలలో వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తిరుమల ఔటర్ రింగ్ రోడ్డు బాలాజీ నగర్ దగ్గర కారు, స్కూటీ ఢీకొన్నాయి. ప్రమాదంలో స్కూటీపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా హాస్పిటల్ కు షిప్ట్ చేశారు. 

ప్రమాదానికి  అతి వేగమే కారణమని తెలుస్తోంది. బాధితుడు ఫొటో గ్రాఫర్ గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.