
తిరుమల శ్రీవారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు వైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాలకు సంబంధించిన పనులను టీటీడీ టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, సీవీఎస్వో మురళి కృష్ణ పరిశీలించారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 16వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వాహన సేవలు ఉంటాయి.
వాహన సేవల వివరాలు
- సెప్టెంబర్23 : సాయంత్రం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
- సెప్టెంబర్24 : సాయంత్రం 05:43 నుంచి 6.15 వరకు మీన లగ్నంలో ధ్వజారోహణం... రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.
- సెప్టెంబర్ 25 : ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం.. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం.. రాత్రి 7 గంటలకు హంస వాహనం
- సెప్టెంబర్ 26 : ఉదయం 8 గంటలకు సింహ వాహనం... మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం
- సెప్టెంబర్27 : ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం..మధ్యాహ్నం 1 గంటకు స్నపనం.. రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం
- సెప్టెంబర్28 : ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం... సాయంత్రం 6:30 నుంచి రాత్రి గరుడ వాహనం
- సెప్టెంబర్29 : ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం.... సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం... రాత్రి 7 గంటలకు గజ వాహనం
- సెప్టెంబర్30 :ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం... రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం
- అక్టోబర్ 1 :ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం
- అక్టోబర్ 2: ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం... రాత్రి 8:30 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణం.