దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ : తిరునల్వేలి ఎంపీ రాబర్ట్ బ్రోస్

దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ  : తిరునల్వేలి ఎంపీ రాబర్ట్ బ్రోస్

ఆమనగల్లు, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఎంపీ రాబర్ట్ బ్రోస్ అన్నారు. శుక్రవారం ఆమనగల్లులో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్ష ఎన్నిక అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దేశానికి రోల్ మోడల్ గా నిలిచాయన్నారు. ఇప్పుడు అన్ని పార్టీలు రిజర్వేషన్ల జపం చేస్తున్నాయని పేర్కొన్నారు. 

పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం దక్కుతుందని చెప్పారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని అన్నారు. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు సాధించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందని తెలిపారు. మరోసారి రేవంత్ రెడ్డిని సీఎం చేసేందుకు పటిష్టమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త అభిప్రాయం మేరకే డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని వివరించారు. సమావేశంలో ఏఐసీసీ నాయకులు శివ సుబ్రహ్మణ్యం, డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పీసీసీ నాయకులు రామ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మార్కెట్​కమిటీ చైర్​ పర్సన్​ గీతానర్సింహ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.