తిరుపతి  నగరం 894 వ పుట్టినరోజు .... ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తిరుపతి  నగరం 894 వ పుట్టినరోజు .... ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనది తిరుపతి నగరమని తెలిపారు  టీటీడీ చైర్మన్​ భూమన. గోవిందరాజపట్నం అంచెలంచెలుగా ఎదిగి తిరుపతి మహానగరమైందన్నారు. మనుషులకు పుట్టినరోజు తరహాలో ఊరికి పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నామని వివరించారు. నగరమంతా పుట్టినరోజు పండుగ చేసుకుందామని పిలుపునిచ్చారు.

శ్రీ మహా విష్ణువు స్వయంభుగా అవతరించిన ఎనిమిది క్షేత్రాలలో తిరుపతి ఒకటి. 1130వ సంవత్సరం.. ఫిబ్రవరి 24న కొండ కింద గోవిందరాజస్వామి ఆలయాన్ని రామానుజాచార్యులు ఏర్పాటు చేయడంతో తిరుపతి చరిత్రకు బీజం పడింది. 894 ఏళ్ల క్రితం సౌమ్య నామ సంవత్సరం పాల్గుణ పౌర్ణమి ఉత్తర నక్షత్రంలో సోమవారం రోజున  తిరుపతి నగరం వెలసింది.

హిందువుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కలియుగా వైకుంఠ క్షేత్రం తిరుపతి పుట్టినరోజు సంబరాలకు సిద్ధమైంది. దాదాపు 9 శతాబ్దాల వయసున్న టెంపుల్‌ సిటీ తిరుపతి ఆవిర్భావ వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేటున్నారు. ఈ నెల 24న ఘనంగా నిర్వహించనున్నామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. రాజకీయాలకు అతీతంగా నిర్వహించే తిరుపతి 894వ పుట్టినరోజు వేడుకలు పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. గత రెండు సంవత్సరాలుగా ఈ వేడుకలను వైభవంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు.

ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనది తిరుపతి నగరమని తెలిపారు భూమన. గోవిందరాజపట్నం అంచెలంచెలుగా ఎదిగి తిరుపతి మహానగరమైందన్నారు. మనుషులకు పుట్టినరోజు తరహాలో ఊరికి పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నామని వివరించారు. నగరమంతా పుట్టినరోజు పండుగ చేసుకుందామని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 24న గోవిందరాజస్వామి ఆలయం దగ్గర నుంచి పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ చేద్దామని చెప్పారు భూమన కరుణాకర్‌రెడ్డి.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి పాదాల చెంత వెలసిన నగరం ఇది. వైష్ణవ సన్యాసి భగవద్ రామానుజాచార్యులు ప్రస్తుతం నగరం నడిబొడ్డున ఉన్న గోవిందరాజ స్వామి ఆలయానికి పునాది వేశారు. ఈ నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు. పట్టణ అభివృద్ధికి నాంది పలికారు. దీంతో  తిరుపతి పట్టణ పుట్టిన రోజు వేడుకలను గోవిందరాజస్వామి ఆలయం వద్ద అర్చకులు, మేళతాళాలు వివిధ కళాకారుల  ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరపనున్నారు.