తిరుపతి లడ్డూ వివాదం.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూ వివాదం.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూ వివాదంపై  సీపీఐ నారాయణ  సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఈ విషయంపై  రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు.  తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని..  దోషులని ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని సీపీఐ నారాయణ అన్నారు.

తప్పు చేసిన అధికారులను, పాత ఈవోను వదిలేయకూడన్న ఆయన.. రాజకీయ లబ్ధి కోసమే అధికార, ప్రతిపక్ష పార్టీలు లడ్డు పై రాద్ధాంతం చేస్తున్నాయన్నారు.. దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదు అన్నారు.

మీ రాజకీయాల కోసం కోట్లాది మంది భక్తులను మనోవేదనకు గురి చేయవద్దని.. సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.. ఈ సమయంలో రాజకీయ నేతలు లడ్డూపై మాట్లాడటం ఆపేయాలని సూచించారు. మీ రాజకీయాల కోసం కావాలంటే కొట్టుకోండి.. కానీ దేవుడిని మాత్రం లాగొద్దు. లడ్డు వివాదం పై అనవసర చర్చలు ఆపి, భక్తుల మనోభావాలను కాపాడాలన్నారు