
హైదరాబాద్, వెలుగు: టాటా గ్రూప్, తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిడ్కో) జాయింట్ వెంచర్ అయిన టైటాన్.. స్మార్ట్‌వాచీల వంటి ఎలక్ట్రానిక్ ప్రొడక్టులను రూపొందించడానికి హైదరాబాద్‌లో 'టైటాన్ స్మార్ట్ ల్యాబ్స్' పేరుతో ఇంజనీరింగ్ సెంటర్‌ను ప్రారంభించింది. టైటాన్ ఎండీ వెంకటరామన్, సీఈఓ సుపర్ణ మిత్ర, ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ, వాచ్‌లు & వేరబుల్స్ హెడ్ రాజ్ నెరవతి కార్యక్రమంలో పాల్గొన్నారు. చీఫ్ గెస్టుగా వచ్చిన తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు ఎంతో ప్రగతిని సాధిస్తున్నాయని చెప్పారు.
టాటాకు జంషెడ్పూర్ తరువాత ఎక్కువ మంది హైదరాబాద్‌లోనే ఉన్నారని చెప్పారు. ఇతర మెట్రోల కంటే ఇక్కడే ట్యాలెంట్, వనరులు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా సుపర్ణ మిత్ర మాట్లాడుతూ స్మార్ట్ వేరబుల్ అండ్ హియరబుల్ ఇండస్ట్రీలో లీడర్‌గా ఎదగాలనే టార్గెట్‌తో పనిచేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ 80 మంది పనిచేస్తారని, త్వరలో వీరి సంఖ్యను మూడు రెట్లు పెంచుతామని రాజ్ చెప్పారు చెప్పారు.గత ఏడాదితో పోలిస్తే తమ ఆదాయం 5 రెట్లు పెరిగిందని అన్నారు. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ క్లాక్, నెక్ బ్యాండ్‌లు ఉంటాయని అన్నారు.