
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ రూపొందిస్తున్న చిత్రం ‘ఖుషి’. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా, తాజాగా టైటిల్ సాంగ్‌కు ముహూర్తం పెట్టారు. జులై 28న ‘ఖుషి’ టైటిల్ సాంగ్ రాబోతోందని తెలియజేస్తూ.. విజయ్ కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు.
ప్రేమలో మునిగినట్టు.. అలా గాల్లో తేలిపోతోన్న విజయ్ దేవరకొండ పోస్టర్ కూల్‌గా ఉంది. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ‘నా రోజా నువ్వే’, ‘ఆరాధ్య’ అంటూ వచ్చిన సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ పాటపైనా అంచనాలు ఉన్నాయి. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.