వరుణ్ తేజ్‌‌ బర్త్ డే సందర్భంగా టైటిల్‌‌ రివీల్

వరుణ్ తేజ్‌‌ బర్త్ డే సందర్భంగా టైటిల్‌‌ రివీల్

వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్‌‌ సత్తారు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. బీవీఎస్‌‌ఎన్‌‌ ప్రసాద్‌‌ నిర్మిస్తున్న ఈ మూవీకి డిఫరెంట్‌‌ టైటిల్‌‌ను ఫిక్స్ చేశారు. వరుణ్ తేజ్‌‌ బర్త్ డే సందర్భంగా గురువారం ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌‌ను రివీల్ చేయడంతో పాటు, ఫస్ట్ లుక్‌‌, మోషన్ పోస్టర్‌‌‌‌ను లాంచ్ చేశారు. ఇందులో క్లాక్ టవర్‌‌‌‌తో పాటు పురాతన కోట బ్యాక్‌‌డ్రాప్‌‌లో కత్తులు, తుపాకులు, బాంబులు లాంటి ఆయుధాలను చూపించారు.

చుట్టూ మంటల మధ్య విలన్స్‌‌తో వరుణ్ తేజ్ ఫైట్ చేస్తున్నట్టుగా డిజైన్ చేసిన మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. వరుణ్ కెరీర్‌‌‌‌లో ఇది 12వ చిత్రం. ప్రేక్షకులు మునుపెన్నడూ చూడనంత కొత్త క్యారెక్టర్‌‌‌‌లో తనను చూపించబోతున్నట్టు చెబుతున్నారు టీమ్. ఈ చిత్రంతో పాటు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌‌ ఆధారంగా ఎయిర్‌‌‌‌ ఫోర్స్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. శక్తి ప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీతో వరుణ్‌‌ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.