ఉద్యోగులే ప్రశ్న పత్రాలు లీక్ చేసి వ్యాపారం చేస్తున్నారు: కోదండరాం

ఉద్యోగులే ప్రశ్న పత్రాలు లీక్ చేసి వ్యాపారం చేస్తున్నారు: కోదండరాం

టీఎస్పీఎస్సీ విషయంలో ఉద్యోగులే ప్రశ్న పత్రాలు లీక్ చేసి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. మార్చి 31వ తేదీ శుక్రవారం సూర్యాపేట జిల్లా- హుజూర్నగర్ లో కోదండరాం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పిన ఆయన ప్రభుత్వం మీద పిల్లలకు నమ్మకం పోయిందన్నారు. గ్రూప్ 1 ప్రశ్నాపత్రం లీకేజీ కేసును సీబీఐకి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు కోదండరాం. టీఎస్పీఎస్సీ పని విధానం మీద సమగ్ర విచారణ చేపట్టాలని తెలిపారు. 

టీఎస్పీఎస్ బోర్డు చైర్మన్, సెక్రెటరిని వెంటనే తొలగించాలన్నారు. పరీక్షల కొత్త షెడ్యూల ను వెంటనే విడుదల చేయాలని కోదండరాం మండిపడ్డారు. ప్రజలకు విశ్వాసం కల్పించాలంటే సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారాయన. భూ నిర్వాసితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా పనిచేస్తుందని ఆరోపించారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. గతంలో లిఫ్టులు ఉన్న ప్రాంతంలోనే మరో కొత్త లిఫ్ట్  తేవడం ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేయడమే అన్నారు కోదండరాం.