బెంగాల్​ బైపోల్ లో తృణమూల్​ క్లీన్​స్వీప్

బెంగాల్​ బైపోల్ లో తృణమూల్​ క్లీన్​స్వీప్

3 అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న అధికార పార్టీ

కోల్‌‌కతా:  పశ్చిమ బెంగాల్  అసెంబ్లీ కి జరిగిన  బైఎలక్షన్​లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్​ స్వీప్​ చేసింది.  బెంగాల్​లో మూడు, ఉత్తరాఖండ్​లో ఒక అసెంబ్లీ స్థానానికి సోమవారం పోలింగ్​ జరిగింది. ఫలితాలను  గురువారం ప్రకటించారు.  బెంగాల్​లోని మూడు సీట్లలోనూ టీఎంసీ గెలిచింది.  కలియాగంజ్,ఖరగ్‌‌పూర్ సదర్ , కరీంపూర్ నియోజకవర్గాల్లో తృణమూల్​ సత్తాచాటింది.  కరీంపూర్​ సీటును నిలబెట్టుకోగా,   బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖరగ్‌‌పూర్ సదర్ , కాంగ్రెస్ సిట్టింగ్​ స్థానమైన​కలియాగంజ్ లో  మమతా బెనర్జీ పార్టీ  విజయం సాధించింది.  టీఎంసీ  గెలుపుపై  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక కామెంట్స్​ చేశారు.  ఇది ‘ఎన్​ఆర్సీ’ కి వ్యతిరేకంగా,  సెక్యులరిజమ్​, యూనిటీకి అనుకూలంగా  ఓటర్లు ఇచ్చిన తీర్పని ఆమె అన్నారు.  బీజేపీ ‘‘దురహంకారానికి’’ తగిన మూల్యం చెల్లించుకుందని విమర్శించారు. మరోవైపు, ఉత్తరాఖండ్ పితోర్ గఢ్​ ఉప ఎన్నికల్లో  బీజేపీ సిట్టింగ్​ స్థానాన్ని కాపాడుకుంది.  పార్టీ కేండిడేట్​ చంద్ర పంత్​ ఈ స్థానం నుంచి గెలిచారు.