ఎంపీ నుస్రత్ ప్రెగ్నెన్సీ! నాకేం సంబంధంలేదంటున్న భర్త!

V6 Velugu Posted on Jun 09, 2021

బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అయితే ఈ సారి మాత్రం రాజకీయాలతో కాకుండా.. తన పర్సనల్ వార్తలతో పాపులర్ అయింది. ఈ బెంగాలీ భామ నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తను జూన్ 19,2019న టర్కీలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె బెంగాల్లో టీఎంసీ తరపున ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. దాంతో అటు పెళ్లి, ఆ వెంటనే రాజకీయ అరంగేట్రం అన్నీ ఆమెకు కలిసి వస్తున్నాయనుకున్నారు. ఎంపీగా గెలుపొందిన వెంటనే నుస్రత్.. కలకత్తాలో అంగరంగవైభవంగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్‌కు సీఎం మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు.

కాగా.. నుస్రత్, జైన్‌ల మధ్య బంధం ఎక్కువకాలం నిలబడలేకపోయింది. జైన్ తన అకౌంట్ల నుంచి డబ్బులను అనుమతి లేకుండా వాడుకున్నాడని నుస్రత్ ఆరోపించింది. అంతేకాకుండా.. తనను కూడా అవసరానికి మాత్రమే వాడుకున్నాడని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ కారణాలతో వారిద్దరూ గత కొన్ని నెలలుగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నుస్రత్ గర్భవతి అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా.. నుస్రత్ కడుపులో పెరుగుతున్న బిడ్డకు, తనకు ఎటువంటి సంబంధంలేదని నిఖిల్ నేషనల్ మీడియాతో చెప్పినట్లు కూడా వార్తలొస్తున్నాయి. 

కాగా.. నటుడు, బీజేపీ నాయకుడైన యష్ దాస్ గుప్తాతో నుస్రత్ సన్నిహితంగా ఉంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆయనతో నుస్రత్ డేటింగ్ చేస్తున్నట్లు కూడా పుకార్లు వస్తున్నాయి. వీరిద్దరూ జోడీగా ఎస్ఓఎస్ 2020 అనే బెంగాలీ సినిమాలో నటించారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు తెలుస్తోంది. 

Tagged bengal, mp nusrat jahan, TMC MP Nusrat Jahan, Nikhil Jain, Nusrat Jahan pregnancy, Yash Dasgupta

Latest Videos

Subscribe Now

More News