మాస్కులు పంచిన సీఎం స్టాలిన్

మాస్కులు పంచిన సీఎం స్టాలిన్

చెన్నై: కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నాయి. ఒమిక్రాన్ విజృంభిస్తున్నా కొందరు జనం ఏ మాత్రం లెక్క చేయడంలేదు. బహిరంగ ప్రదేశాల్లో సైతం మాస్క్లు లేకుండానే తిరుగుతున్నారు. మాస్క్ లేకుండా తిరుగుతున్న వారిని చూసి తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన పని ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం స్టాలిన్ సెక్రటేరియట్ కు బయలుదేరారు. అన్నా సలై ప్రాంతానికి చేరుకునే సరికి అక్కడ చాలా మంది మాస్కులు లేకుండానే తిరుగుతున్న విషయం గ్రహించాడు. దీంతో స్టాలిన్ వెంటనే కాన్వాయ్ను పక్కకు ఆపి వారి దగ్గరకు వెళ్లారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ మాస్కులు లేకుండా తిరుగుతున్న  వారికి స్వయంగా మాస్కులు తొడిగారు. మాస్కుల ప్రాధాన్యం వివరిస్తూ అక్కడున్న వారికి మాస్క్ లు పంచిపెట్టారు. అనంతరం అనంతరం ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ తో కలిసి రివ్యూ మీటింగ్కు బయలుదేరి వెళ్లారు.

మరిన్ని వార్తల కోసం..

కరోనా కొత్త వేరియంట్ కలకలం

బండి సంజయ్ లేఖపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా