ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి

రాష్ట్రంలోని పలు జిల్లాలో 16వ తేదీ అయినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రావడం లేదన్నారు టీఎన్జీవో అధ్యక్షుడు మామళ్ల రాజేందర్. ఉద్యోగుల విభజన ఆరకోరగా మాత్రమే సాగిందని..ఇక నుండి 1వ తేదీనే జీతాలివ్వాలని కోరారు. నాంపల్లిలో టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గం  సమావేశమై ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఏ జిల్లాలో ఉన్న ఉద్యోగిని ఆ జిల్లాలో కొనసాగిస్తామని సీఎం హామీ ఇచ్చారని..అయితే అప్పీళ్ల పరిష్కారం పరిష్కారం జరగలేదని చెప్పారు. కొందర అధికారులు తమ నిర్లక్ష్యంతో సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కొత్త జిల్లాలో ఉద్యోగుల క్యాడర్ స్ట్రెంత్ పెంచాలన్నారు. EHS ఏ జిల్లాలో పనిచేయడం లేదని.. EHS మెరుగైన సేవల కోసం 2శాతం జీతం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాజేందర్ ప్రకటించారు.

ఇక పెండింగ్ అంశాలన్నీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మామళ్ల రాజేందర్ డిమాండ్ చేశారు. 317 జీవో వల్ల ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్న ఆయన..317జీవో తో సంబంధం లేకుండా సాధారణ బదిలీలు చేయాలని చెప్పారు. ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ తీసుకరావాలని సీఎంను కోరారు. సౌకర్యలేమితో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. సీబీఎస్ ను రద్దు చేయడంతోపాటు  ఇన్కమ్ టాక్స్ సీలింగ్ 15శాతానికి పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వీఆర్వోలకు ఉద్యోగభద్రత కల్పించి పదోన్నతులు ఇవ్వాలన్నారు. పెండింగ్ పీఆర్సీ నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు.