యూత్కు కనెక్ట్ అయ్యేలా.. శ్రీమహా విష్ణు

యూత్కు కనెక్ట్ అయ్యేలా.. శ్రీమహా విష్ణు

‘సిద్ధార్థ్ రాయ్’  చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన దీపక్ సరోజ్.. తన రెండో సినిమాను అనౌన్స్ చేశాడు. హరి హరన్ గోధగాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని   శ్రీ లక్ష్మీ నరసింహ ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రొడక్షన్ నెం. 1గా శ్రీహరి తన్నీరు నిర్మిస్తున్నారు. దీపక్ సరోజ్ సరసన అనైరా గుప్తా, దీప్సిక  నటిస్తున్నారు. 

 శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్.   ‘శ్రీమహా విష్ణు’  టైటిల్‌‌‌‌‌‌‌‌తో తెరకెక్కిస్తున్నట్టు రివీల్ చేశారు. ఈ సందర్భంగా  విడుదల చేసిన రొమాంటిక్  ఫస్ట్ లుక్ పోస్టర్   హీరో హీరోయిన్ మధ్య ఒక లవ్లీ మూమెంట్‌‌‌‌‌‌‌‌ని  ప్రెజెంట్ చేస్తోంది. ‘ప్రతి హృదయానికి ఒక కథ ఉంటుంది’  అనే ట్యాగ్‌‌‌‌‌‌‌‌లైన్  సున్నితమైన ప్రేమకథను సూచిస్తుంది. 

యువత కనెక్ట్ అయ్యే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని,  ప్రేమను వేడుకలా చూపిస్తూ, కుటుంబ విలువల ప్రాముఖ్యతను చూపించబోతున్నామని దర్శక నిర్మాతలు తెలియజేశారు. రఘుబాబు, సుదర్శన్, రచ్చ రవి, జబర్దస్త్ ఆది ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి  అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.