ఏపీలోకి రావాలంటే  2 వారాలు క్వారంటైన్ లో ఉండాలి

ఏపీలోకి రావాలంటే  2 వారాలు క్వారంటైన్ లో ఉండాలి

తెలంగాణ నుండి భారీగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వరాష్ట్రానికి వెళ్తుండడంతో ఏపీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ బార్డర్లో అడుగుపెట్టాలంటే ముందుగా రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుందన్నారు డీజీపీ గౌతమ్ సావంగ్. అందుకు సిద్ధమైతే చెక్ పోస్ట్ దాటి ఏపీకి అనుమతి ఇస్తామని అక్కడ నుండి క్వారంటైన్ కి తరలిస్తామని చెప్పారు. పోలీసులు తీసుకున్న నిర్ణయానికి కొందరు అంగీకరించినా…మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. తమ సొంత రాష్ట్రాని తాము వస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ లో హాస్టళ్ల మూసివేతతో పెద్ద సంఖ్యలో యువత తెలంగాణ నుంచి ఏపీకి రావడంతో తెలుగురాష్టాల సరిహద్దుల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై స్పందించిన సవాంగ్ కరోనా వైరస్ ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిందని, ఎక్కడివారు అక్కడే ఉండాల్సిందిగా ప్రధాని, సీఎం కోరారని స్పష్టం చేశారు. ఇప్పుడు యువతకు ఏపీలోకి పర్మిషన్ ఇస్తే లాక్ డౌన్ ను నీరుగార్చినట్లే అవుతుందన్నారు.