గంగాధర, వెలుగు: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పెద్ద ఆచంపల్లి గ్రామస్తులకు కోతుల బెడదను తప్పించేందుకు జీపీ సిబ్బంది చింపాంజీ డ్రెస్సు ధరించారు. గురువారం వీధులు, పొలాల వెంట తిరుగుతూ భయపెట్టడడంతో కోతులు పారిపోయాయి.
పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు కోతుల బాధ నుంచి విముక్తి కల్పిస్తున్నట్టు సర్పంచ్ తేజశ్రీ రాజశేఖర్తెలిపారు. రెండు చింపాంజీ డ్రెస్సులను కొనుగోలు చేసి జీపీ సిబ్బంది ఇచ్చామని, వాటిని ధరించి కోతులను తరుముతున్నట్టు చెప్పారు. దీంతో సర్పంచ్ ప్రయత్నాన్ని గ్రామస్తులు అభినందించారు.
