దిగివస్తున్న చికెన్ ​ధరలు.. కిలో చికెన్​ రూ.150 వరకు

దిగివస్తున్న చికెన్ ​ధరలు..    కిలో చికెన్​ రూ.150 వరకు

హైదరాబాద్, వెలుగు :  చికెన్​ ధరలు దిగుతున్నాయి. రెండు వారాల క్రితం  రెండు వందలకు పైగా ఉన్న చికెన్ రేట్.. ప్రస్తుతం 150 రూపాయలు ఉంది. ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు మార్కెట్​వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో చాలా ఇండ్లలో నాన్​వెజ్​తినడం మానేశారు. అయ్యప్ప మాల వేస్తున్నవారి కుటుంబాలు కూడా నాన్​వెజ్ కు దూరంగా ఉంటున్నాయి. దీంతో చికెన్​డిమాండ్​తగ్గింది. అయితే  వింటర్ సీజన్​కో ళ్ల ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. మిగతా సీజన్​లో కంటే ఈ సీజన్ లో బ్రాయిలర్ల క్రాప్​ఎక్కువ వస్తుంటుంది. 

కోళ్లు ఒక పరిమాణానికి రాగానే అమ్మెయాల్సి ఉంటుంది. లేదంటే రోజూ అవి తినే దాణా ఖర్చు కంపెనీలకు నష్టంగా మారుతుంది. దీంతో వ్యాపారులు కోళ్లను ఫారాల్లో ఎక్కువ రోజులు పెట్టే అవకాశం ఉండదు. దీంతో మార్కెట్ వచ్చే కోళ్ల సంఖ్య గతంతో పోలిస్తే కొంత ఎక్కువగానే ఉండటం, బయట మార్కెట్​లో చికెన్​డిమాండ్​ తక్కువగా ఉండటంతో కొద్దిరోజులుగా ధరలు తగ్గతూ వస్తున్నాయి. 

అయితే కార్తీక మాసం తర్వాత ధరలు పెరగవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం  డ్రెస్స్​డ్​130 రూపాయలు, స్కిన్​లెస్​రూ. 150 పలుకుతున్నది. గత నాలుగు నెలల కాలంలో ఇవే అత్యంత కనిష్ట ధరలుగా మార్కెట్​వర్గాలు చెబుతున్నాయి.