తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగతున్నాయి. వారం రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ వస్తున్న పసిడి ధరల్లో ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదు. వెండి ధరలు మాత్రం స్వల్ప తగ్గాయి.రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. రానున్న మార్చి నెలలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభంకానున్నాయి. ఈక్రమంలో బంగారం ధరలు పెరుగొచ్చంటున్నారు.  దీంతో ముందే బంగారం ఆభరణాలను కొనేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.  2024, ఫిబ్రవరి 27వ తేదీ మంగళవారం దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. 

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర  రూ. 57,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,840గా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరమైన విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఇక,  కిలో వెండిపై 900 రూపాయలు తగ్గింది. దీంతో  కిలో వెండి ధర రూ.75,500లా ఉంది.

 ALSO READ : త్వరగా లెక్కలు తేల్చాలె .. బైజూస్​ వ్యవహారంపై కేంద్రం ఆదేశం

 దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు:

 

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57,750...  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,940 ఉండగా.. కిలో వెండిపై రూ.500 తగ్గి.. ధర 74,000గా ఉంది.
  • దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57,600.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,840గా ఉంది.
  • కోల్ కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57,600..  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,840గా ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57,600.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,840గా ఉంది
  • చెన్నైలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 50 పెరిగి.. ధర  రూ. 58,150గా ఉంది.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 60 రూపాయలు పెరిగి.. ధర రూ. 63,380గా ఉంది.