
కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన బంగారం..ఇవాళ కూడా పెరిగింది. మార్కెట్‌లో శుక్రవారం గోల్డ్ రేట్ స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరగడంతో రూ.35,600గా ఉంది. అంతర్జాతీ ట్రెండ్ సానుకూలముగా ఉన్నప్పటికీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడంతో గోల్డ్ ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయని తెలిపాయి మార్కెట్ వర్గాలు.
కేజీ వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రూ.40,355 వద్ద కొనసాగుతోంది