
కొలంబో: తొలి వన్డేలో సూపర్ డామినేషన్ చేసిన టీమిండియా.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. మంగళవారం శ్రీలంకతో జరిగే సెకండ్ వన్డేలో నెగ్గి ఇక్కడే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. దీంతో సత్తా చాటేందుకు ఇండియా కుర్రాళ్లకు మరో అద్భుతమైన చాన్స్ వచ్చింది. ఈ మ్యాచ్ కోసం ఫైనల్ ఎలెవన్‌లో మార్పు చేసే అవకాశం కనిపించడం లేదు. దీంతో తొలి వన్డేలో రాణించిన కెప్టెన్ ధవన్, పృథ్వీ షా, డెబ్యూ ప్లేయర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.. ఫామ్ కొనసాగించాలని భావిస్తున్నారు. అయితే మనీశ్ పాండే విఫలం కావడం కొద్దిగా ప్రతికూలాంశమే అయినా.. ఈ మ్యాచ్‌లో గాడిలో పడతాడని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. పృథ్వీ షా షాట్ సెలెక్షన్‌ను మెరుగుపర్చుకోవాలని చూస్తుండగా, ఇషాన్, సూర్య భారీ ఇన్నింగ్స్‌లపై కన్నేశారు. ఇక బౌలింగ్‌లో కుల్దీప్, చహల్ మెరిస్తే ఇండియా విజయం నల్లేరుమీద నడకే. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐదు ఓవర్లు బౌలింగ్ చేయడం శుభసూచకం. సీనియర్ పేసర్ భువనేశ్వర్ ఫామ్‌లోకి రాకపోయినా.. అతనిపై నమ్మకం ఉంది. దీపక్ చహర్, క్రునాల్ కూడా మెరిస్తే ఇండియాకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. మరోవైపు లంక కూడా ఈ మ్యాచ్‌పై భారీగానే ఆశలు పెట్టుకుంది. ఎలాగైనా గెలిచి సిరీస్ చేజారకుండా చూసుకోవాలని భావిస్తోంది. అయితే టీమ్‌లో ఎక్స్‌పీరియెన్స్ ప్లేయర్లు లేకపోవడం ప్రతికూలంగా మారింది. బ్యాట్స్‌మెన్‌కు మంచి ఆరంభం లభించినా.. భారీ ఇన్నింగ్స్‌గా మలవలేకపోయారు. ఈ మ్యాచ్‌లో ఈ సమస్యను అధిగమిస్తే కనీసం 300ల టార్గెట్‌ను ఇండియా ముందు పెట్టొచ్చు. బౌలర్ల పెర్ఫామెన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇండియన్ బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకోవాలంటే వీళ్లు మరింత స్కిల్స్ చూపెట్టాలి. స్లో పిచ్ కాబట్టి ఇరుజట్లు ఛేజింగ్ తీసు