బాసర క్షేత్ర అభివృద్ధి కోసం రూ. 50 కోట్లు మంజూరు

 బాసర క్షేత్ర అభివృద్ధి కోసం రూ. 50 కోట్లు మంజూరు

భైంసా, వెలుగు: బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించనున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి కార్యక్రమానికి హాజరు కానున్నారు. బాసర క్షేత్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు మంజూరు చేసింది. వాటిలో రూ. 8 కోట్లు వివిధ అభివృద్ధి పనులకు వెచ్చించగా మరో రూ. 42 కోట్లు ఉన్నాయి. ఈ నిధులతో పనులు చేపట్టనున్నారు.

అమ్మవారి ఆలయాన్ని కృష్ణ శిలలతో నిర్మిస్తారు. ఇరుకుగా ఉన్న ఆలయ ప్రాంగణాన్ని విస్తరించి ప్రాకార మండపం నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలను నిర్మించనున్నారు. వీటితోపాటు మహంకాళి, దత్తాత్రేయ మందిరాలను నిర్మిస్తారు. వీటన్నింటికీ రూ. వంద కోట్ల వరకు అవసరముందని అధికారులు అంచనా వేశారు. గురువారం ఆలయ ఈవో విజయరామారావు ప్రెస్​ మీట్​ నిర్వహించి ఆలయ పునర్నిర్మాణంపై సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.