నేడు ఇండియా, కివీస్​ మూడో టీ20

నేడు ఇండియా, కివీస్​ మూడో టీ20

అహ్మదాబాద్: సొంతగడ్డపై టీమిండియా మరో సిరీస్ విజయం​పై గురి పెట్టింది. ఇప్పటికే వన్డే సిరీస్​ను చేజిక్కించుకున్న ఇండియా... బుధవారం న్యూజిలాండ్​తో జరిగే థర్డ్​ టీ20లో నెగ్గి ఈ సిరీస్​నూ సొంతం చేసుకోవాలని టార్గెట్​గా పెట్టుకుంది. మూడు మ్యాచ్​ల సిరీస్​లో​ ప్రస్తుతం ఇరుజట్లు 1–1తో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే గత పదేళ్లలో ఫార్మాట్లకు అనుగుణంగా టీమిండియా 55 బైలేటరల్​ సిరీస్​లు ఆడితే.. 47 నెగ్గింది. కేవలం 2015లో సౌతాఫ్రికా, 2019లో ఆస్ట్రేలియా మాత్రమే ఇండియాపై విజయాలు సాధించాయి. ఇక న్యూజిలాండ్ అయితే ఒక్కసారి కూడా సిరీస్​ నెగ్గిన దాఖలాల్లేవు. దీంతో జోరు కొనసాగించాలని పాండ్యాసేన.. హిస్టరీని తిరగరాయాలని కివీస్​ ప్లాన్స్​ రెడీ చేస్తున్నాయి. 

టాపార్డర్​పై ఒత్తిడి..

ఈ మ్యాచ్​ కోసం ఇండియా ఫైనల్​ ఎలెవన్​లో మార్పులు చేయడం లేదు. అయితే గత మ్యాచ్​ల్లో విఫలమైన టాపార్డర్​పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఓపెనింగ్​లో గిల్​, ఇషాన్​తో పాటు రాహుల్​ త్రిపాఠి ఫామ్​పై ఆందోళన కొనసాగుతున్నది. అయితే ఈ సిరీస్​ తర్వాత టీ20 మ్యాచ్​లు లేకపోవడం, వన్డే వరల్డ్​కప్​ ప్రిపరేషన్స్​ ఉండటంతో యంగ్​స్టర్స్​  భారీ స్కోర్లపై దృష్టి సారించారు. దీపక్​ హుడాకు ఇదే లాస్ట్​ చాన్స్​. సూర్యకుమార్​, పాండ్యా, సుందర్​ ఫామ్​లో ఉండటం కలిసొచ్చే అంశం. బౌలింగ్​లో శివమ్​ మావి, అర్ష్​దీప్​ సింగ్​ను కొనసాగించొచ్చు. లక్నో మ్యాచ్​ అర్ష్​దీప్​లో కాన్ఫిడెన్స్​ పెంచింది. టర్నింగ్​ వికెట్​ అయితే కుల్దీప్​తో పాటు చహల్​ను కూడా తుది జట్టులోకి తీసుకోవచ్చు. అప్పుడు ఉమ్రాన్​ మాలిక్​ బెంచ్​కు పరిమితమవుతాడు. 

కివీస్​ అదే జట్టుతో!

ఇండియాలో సిరీస్​ గెలిచే అరుదైన చాన్స్​ రావడంతో కివీస్​ కూడా ఈ మ్యాచ్​ కోసం భారీ ఫ్లాన్స్​ రెడీ చేస్తోంది. అయితే తుది జట్టును మార్చకపోయినా.. ఆర్డర్​లో మార్పులు ఉండొచ్చని సంకేతాలిచ్చింది. ఇందుకోసం మిడిలార్డర్​ను మరింత బలోపేతం చేయనుంది. గ్లెన్​ ఫిలిప్స్​పై భారీ ఆశలు పెట్టుకున్నా ఇప్పటివరకు సక్సెస్​ కాలేదు. బ్రేస్​వెల్​ నుంచి మరో భారీ ఇన్నింగ్స్​ను ఆశిస్తున్నారు. చాప్​మన్​ కూడా కీలకం కానున్నాడు. గత మ్యాచ్​లో ఎనిమిది మంది బౌలర్లు ఉపయోగించినా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయారు. దీంతో ఈసారి బౌలింగ్ కాంబినేషన్​లో మార్పులు చేస్తారేమో చూడాలి.

జట్ల (అంచనా) 

ఇండియా: హార్దిక్​ (కెప్టెన్​), గిల్​, ఇషాన్​, రాహుల్​ త్రిపాఠి, సూర్యకుమార్, దీపక్​ హుడా, వాషింగ్టన్​ సుందర్​, శివమ్​ మావి, కుల్దీప్​ యాదవ్​, ఉమ్రాన్​ మాలిక్​, అర్ష్​దీప్​ సింగ్​. 

న్యూజిలాండ్​: శాంట్నర్​ (కెప్టెన్​), ఫిన్​ అలెన్​, కాన్వే, చాప్​మన్​, గ్లెన్​ ఫిలిప్స్​, డారిల్​ మిచెల్​, మైకేల్​ బ్రేస్​వెల్​,సోధీ, ఫెర్గుసన్​, డఫీ, ​ టిక్నర్​.