Today OTT Movies: ఇవాళ ఓటీటీలోకి 20 సినిమాలు.. అగ్లీ స్టోరీ నుంచి ధురంధర్ 2 వరకు.. తెలుగులో మరో 6 స్పెషల్

Today OTT Movies: ఇవాళ ఓటీటీలోకి 20 సినిమాలు.. అగ్లీ స్టోరీ నుంచి ధురంధర్ 2 వరకు.. తెలుగులో మరో 6 స్పెషల్

ఈ వీకెండ్కి థియేటర్లో ఓ రెండు కొత్త సినిమాలే దర్శనం ఇచ్చాయి. అందులో ఒకటి రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ కాగా, మరొకటి వరుణ్ ధావన్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. అయితే ఈ రెండు సినిమాలతోనే వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ముగిసిపోతుందని అనుకుంటే పొరపాటే.

ఎందుకంటే ఇవాళ (జూన్ 5) ఒక్కరోజే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో 20కి పైగా కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. యాక్షన్, థ్రిల్లర్, క్రైమ్, రొమాన్స్, కామెడీ, హారర్, స్పై డ్రామా.. ఇలా అన్ని జోనర్లలోనూ ప్రేక్షకులను అలరించే కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. మరి ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేయండి. 

ఆహా తెలుగు:

అగ్లీ స్టోరీ (తెలుగు సైకలాజికల్ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్)- జూన్ 5

ఆహా తమిళ్:

సత్తేంద్రు మారుధు వాణిలయ్ (తమిళ రొమాంటిక్ థ్రిల్లర్)- జూన్ 5

జియో హాట్‌స్టార్:

ధురంధర్ 2: ది రివేంజ్ (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్)- జూన్ 5 

నెట్‌ఫ్లిక్స్:

29 (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ)- జూన్ 5

ది మార్క్‌డ్ ఉమెన్ (స్పానిష్ క్రైమ్ మిస్టరీ)- జూన్ 5

మెక్సికో 86 (స్పానిష్ స్పోర్ట్స్ కామెడీ)- జూన్ 5

ఆఫీస్ రొమాన్స్ (అమెరికన్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- జూన్ 5

టీచ్ యూ ఏ లెసన్ (కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 5

జీ5:

పేట్రియాట్ (తెలుగు డబ్బింగ్ మలయాళ థ్రిల్లర్)- జూన్ 5

బ్రౌన్ (హిందీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 5

కేడీ ది డెవిల్ (తెలుగు డబ్బింగ్ కన్నడ గ్యాంగ్‌స్టర్)- జూన్ 5

అమెజాన్ ప్రైమ్:

ది పిరమిడ్ స్కీమ్ (హిందీ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 5

పీటర్ (కన్నడ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూన్ 5

సన్ నెక్ట్స్ ఓటీటీ:

ది రైజ్ ఆఫ్ అశోక (తెలుగు డబ్బింగ్ కన్నడ పీరియాడిక్)- జూన్ 5

మెకానిక్ రాకీ (తెలుగు యాక్షన్ కామెడీ)- జూన్ 5

సోనీ లివ్:

గుల్లాక్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ సిరీస్)- జూన్ 5

వికి ఓటీటీ:

ది లై వుయ్ లివ్‌డ్ ఇన్ (కొరియన్ మిస్టరీ థ్లిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 5

హోయ్‌చోయ్ ఓటీటీ:

బీబీ ప్యారా (బెంగాలీ డార్క్ థ్రిల్లర్)- జూన్ 5

ఆపిల్ ప్లస్ టీవీ:

కేప్ ఫియర్ (ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 5

బెస్ట్ ఛాయిస్‌లు ఇవే..

ఈ వారం ఓటీటీలో విడుదలైన చిత్రాల్లో తెలుగు డైరెక్ట్ మూవీ ‘అగ్లీ స్టోరీ’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్‌లో బోల్డ్ లవ్, రిలేషన్‌షిప్ ఎలిమెంట్స్‌తో పాటు సస్పెన్స్ అంశాలు కూడా ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

డబ్బింగ్ సినిమాల పరంగా చూస్తే, మలయాళం నుంచి వచ్చిన ‘పేట్రియాట్’, కన్నడ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘కేడీ ది డెవిల్’, ది రైజ్ ఆఫ్ అశోక, హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివేంజ్’ మంచి ఆప్షన్స్‌గా కనిపిస్తున్నాయి.

అలాగే ‘బ్రౌన్’ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘గుల్లాక్ సీజన్ 5’ కూడా ఆసక్తి కలిగించనున్నాయి. ఇక అంతర్జాతీయ కంటెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకుల కోసం ‘కేప్ ఫియర్’, ‘ది మార్క్‌డ్ ఉమెన్’ వంటి క్రైమ్, మిస్టరీ, హారర్ థ్రిల్లర్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి.