Today OTT Movies: ఓటీటీకి వచ్చిన లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్.. వరుస హత్యలతో వణుకు పుట్టించేలా

Today OTT Movies: ఓటీటీకి వచ్చిన లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్.. వరుస హత్యలతో వణుకు పుట్టించేలా

ఇవాళ (మే 29) ఓటీటీలోకి ఒక్కరోజే రెండు ఇంట్రెస్టింగ్ మూవీస్ స్ట్రీమింగ్కు వచ్చాయి. అందులో ఒకటి తెలుగు సూపర్ హిట్ మూవీ కాగా మరొకటి తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్‌‌‌‌. ఆడియన్స్ ఈ సినిమాల కోసం ఎప్పటునుంచో ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు.. ఈ సినిమాలు వాటి బ్లాక్ బాస్టర్స్ ఫ్రాంచైజీలో తెరకెక్కి వీపరీతంగా ఆకట్టుకున్నవి. దానికి తోడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యాయి. మరి ఆ సినిమాలేంటీ? అవెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి సినిమా కథేంటీ? అనే పూర్తీ వివరాలపై ఓ లుక్కేద్దాం.

హిట్ 3:

నాని నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ హిట్ 3 (HIT3).మే 1న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నేడు (మే29న) ఓటీటీకి వచ్చేసింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ మంచి ధరకు సొంతం చేసుకుంది. ఈ సందర్బంగా 4కే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఆడియోతో ఈ మూవీ ఫ్యాన్స్ కు మంచి ఎక్స్ పీరియన్స్ ను అందిస్తోందని నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. 

Also Read : 70 ఏళ్ల కమల్ లిప్‌కిస్‌లు, రొమాన్స్పై నెటిజ‌న్ల ట్రోల్స్

హిట్ 3 మూవీని శైలేష్ కొలను మాస్ యాక్షన్ తో పాటు బీభత్సమైన వైలెన్స్ తో తెరకెక్కించాడు. ఇందులో అర్జున్ సర్కార్ ఐపీఎస్గా నాని తన విశ్వరూపం చూపించారు. నాని కెరియర్లోనే మునుపెన్నడూ లేని విధంగా ఫుల్ యాక్షన్ తో ఇరగదీశాడు. సినిమా మొత్తం తన వైలెంట్ క్రైమ్ తో స్క్రీన్ పై ఇంటెన్సివ్ యాంగిల్ ప్రదర్శించాడు. ఈ అంశాలతో నాని ఖాతాలో వైల్డ్ ఫ్యాన్స్ కూడా చేరిపోయారు. 

కథేంటంటే:

హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం (HIT)లో ఎస్పీ హోదా ఆఫీసర్ అర్జున్ సర్కార్ (నాని). కాశ్మీర్ నుండి ట్రాన్స్ ఫర్పై విశాఖపట్నం వచ్చిన అర్జున్.. వచ్చి రావడంతోనే రెండు దారుణ హత్యలు చేస్తాడు. అతను చేసిన ఈ రెండు హత్యలు గతంలో తాను పని చేసిన కాశ్మీర్ లోని సైకో పాత్ మర్డర్స్ తరహాలో ఉంటాయి.

దేశంలోని 13 చోట్ల ఇదే తరహా సైకో మర్డర్స్ జరుగుతుంటాయి. ఈ హత్యల వెనుక  కాప్చర్ టార్చర్ కిల్ (సి.టి.కె.) అనే డార్క్ వెబ్ సైట్ ఉందని తెలుస్తుంది. సి.టి.కె. కు అర్జున్ సర్కార్కు సంబంధం ఏమిటి.. అతను ఎందుకు మర్డర్స్ చేశాడు.. అతని జీవితంలో మృదుల (శ్రీనిధి శెట్టి) పాత్ర ఏమిటి.. అనేది మిగతా కథ.

క్రిమినల్ జస్టీస్ సీజన్ 4:

పంకజ్ త్రిపాఠి లీడ్ రోల్‌‌‌‌లో వచ్చిన వెబ్ సిరీస్‌‌‌‌ ‘క్రిమినల్ జస్టిస్‌‌‌‌’.ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో వచ్చిన మూడు సీజన్స్‌‌‌‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో నాలుగో భాగాన్ని సిద్ధం చేశారు.

‘క్రిమినల్ జస్టిస్‌‌‌‌4: ఎ ఫ్యామిలీ మ్యాటర్‌‌‌‌‌‌‌‌’ టైటిల్‌‌‌‌తో తెరకెక్కిన నాలుగో సీజన్‌‌‌‌కు రోషన్ సిప్పీ దర్శకుడు.బీబీసీ స్టూడియోస్‌‌‌‌ నిర్మించింది. ఇవాళ మే29 నుంచి  జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంది.