
టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్య పతకం సొంతం చేసుకుంది. చైనా ప్లేయర్ బింగ్ జియావోపై విజయం సాధించి ఈ ఒలింపిక్ మెడల్ గెలుచుకున్న సింధు ఒక కొత్త రికార్డును సొంతం చేసుకుంది. రెండు ఒలింపిక్స్‌లో మెడల్స్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఇండియా నుంచి ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ గెలుచుకున్న తొలి మహిళా ఇండివీడ్యువల్ ప్లేయర్ సింధు మాత్రమే. గతంలో ఎవరూ ఈ ఘనతను సొంతం చేసుకోలేకపోయారు. శనివారం సెమీస్‌లో ఓడిపోయిన సింధు ఇవాళ కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో 21-13, 21-15 తేడాతో బింగ్ జియావోపై రెండు సెట్లలోనూ ఘన విజయం సాధించింది. ఐదేండ్ల క్రితం 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో సింధు సిల్వర్ మెడల్ గెలుచుకున్న విషయం తెలిసిందే.