ఒలింపిక్స్ ఫ్యాన్స్​కు కొత్త రూల్స్.. మందు, చిందు, బంద్​

ఒలింపిక్స్ ఫ్యాన్స్​కు కొత్త రూల్స్.. మందు, చిందు, బంద్​


టోక్యో: కరోనా నేపథ్యంలో.. ఒలింపిక్స్‌‌‌‌ స్టేడియాలకు వచ్చే ఫ్యాన్స్‌‌‌‌కు కఠినమైన రూల్స్‌‌‌‌ పెట్టారు. స్టేడియంలో మందేయడం, చిందేయడం లాంటివి చేయకూడదు. కంప్లీట్‌‌‌‌గా ఆల్కహాల్‌‌‌‌ను నిషేధించారు. ఇక తమకు ఇష్టమైన అథ్లెట్లను ఉత్సాహపరిచేందుకు ఇష్టమొచ్చినట్లు డ్యాన్స్‌‌‌‌లు కూడా చేయరాదు. అథ్లెట్లను ఆటోగ్రాఫ్‌‌‌‌లు అడగటం, వారితో మాట్లాడేందుకు ట్రై చేయడం వంటి పనులు చేయకూడదు. ఆఖరికి స్టాండ్స్‌‌‌‌లోని ఇతర వ్యక్తులతో కూడా మాట్లాడొద్దని ఆర్గనైజర్స్‌‌‌‌ తెలిపారు. ఫ్యాన్స్‌‌‌‌ ఈ రూల్స్‌‌‌‌ను బ్రేక్‌‌‌‌ చేస్తే తక్షణమే బయటకు పంపిస్తామన్నారు. కొవిడ్‌‌‌‌ నేపథ్యంలో ఫ్యాన్స్‌‌‌‌ను కంట్రోల్‌‌‌‌ చేయడం తమకు అతిపెద్ద సవాల్‌‌‌‌ అని టోక్యో–2020 ప్రెసిడెంట్‌‌‌‌ షికో హషీమోటో పేర్కొన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న యూరో కప్‌‌‌‌లో ఉన్న సందడిని.. ఒలింపిక్స్‌‌‌‌లో ఆశించొద్దని హెచ్చరించాడు.  

ఉగాండ టీమ్‌‌‌‌లో సెకండ్‌‌‌‌ పాజిటివ్‌‌‌‌

ఒలింపిక్స్‌‌‌‌ కోసం వచ్చిన ఉగాండ టీమ్‌‌‌‌లో కరోనా కలవరం రేగింది.  ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో ఓ కోచ్‌‌‌‌ పాజిటివ్‌‌‌‌గా తేలాడు. దీంతో అతన్ని క్వారంటైన్‌‌‌‌లో ఉంచారు. మిగిలిన బృందాన్ని ఒసాకాలో ట్రెయినింగ్‌‌‌‌ క్యాంప్‌‌‌‌కు పంపినా.. జులై 3 వరకు క్వారంటైన్‌‌‌‌లో ఉండాలని సూచించారు. కానీ ఈ బృందంలోని మరో వ్యక్తికి పాజిటివ్‌‌‌‌ వచ్చింది.