పతకం కోల్పోయినా.. పెర్ఫార్మెన్స్ గుర్తుండిపోతుంది

V6 Velugu Posted on Aug 06, 2021

ఒలింపిక్స్ లో పతకం సాధించకుండానే వెనుదిరిగింది భారత ఉమెన్స్ హాకీ టీమ్. బ్రిటన్ తో జరిగిన కాంస్య పతక పోరులో 4, 3 తేడాతో పోరాడి ఓడిపోయింది. నాలుగు గోల్స్ చేసిన బ్రిటన్.. కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొదటి నుంచి మ్యాచ్ ఇంట్రెస్టింగా సాగింది. ఫస్ట్ క్వార్టర్ లో రెండు టీంలు గోల్ చేయలేకపోయాయి.  సెకండ్ క్వార్టర్ లో రెండు పెనాల్టీ కార్నర్ లను భారత టీం గోల్స్ గా మార్చుకుంది. తర్వాత మ్యాచ్ హాఫ్ టైంలో వందనా కటారియా మూడో గోల్ అందించారు. మూడో క్వార్టర్ లో బ్రిటన్ మరో గోల్ చేసింది. ఫోర్త్ క్వార్టర్  ప్రారంభంలో బ్రిటన్ మరో గోల్  చేసింది. దీంతో భారత టీంపై ఒత్తిడి పెరిగింది. మరో గోల్ చేసే ప్రయత్నంలో తడబడింది. మూడో గోల్ దగ్గరే ఆగిపోయింది. దీంతో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది భారత మహిళల జట్టు.

విమెన్ హాకీ టీంను చూసి గర్వపడుతున్నానన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఒలింపిక్స్ లో విమెన్స్ హాకీ టీం పెర్ఫార్మెన్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. పతకం కోల్పోయినా.. వారి ఆటతీరు న్యూ ఇండియా స్పూర్తిని ప్రతిబింభించిందన్నారు మోడీ. ఇది మరింత మంది అమ్మాయిలు హాకీని ఎంచుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు.

తమ రాష్ట్రానికి చెందిన 9  మంది విమెన్స్ హాకీ టీం మెంబర్స్ కి.. 50లక్షల రూపాయల చొప్పున రివార్డ్ ఇస్తామని ప్రకటించారు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. మ్యాచ్ లో అద్భుతంగా ఆడారన్నారు. మ్యాచ్ గెలిచిదాని  కంటే.. అమ్మాయిల ఆట తీరు చాలా సంతృప్తినిచ్చిందన్నారు. టీంలోని 9 మంది తమ రాష్ట్రానికి చెందని వారు కావడం సంతోషంగా ఉందన్నారు ఖట్టర్. 

Tagged Tokyo Olympics, Spirited Indian Women Hockey Team, Down Fight, Bronze Match

Latest Videos

Subscribe Now

More News