నా ఫిజిక్ నాకు అడ్వాంటేజ్‌‌

నా ఫిజిక్ నాకు అడ్వాంటేజ్‌‌

కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాజా విక్రమార్క’. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్. 88 రామారెడ్డి నిర్మించిన ఈ మూవీ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన కబుర్లు.

‘‘ఆర్ఎక్స్ 100 టైమ్‌‌లోనే ఈ కథ విన్నాను. శ్రీతో పది నిమిషాలు మాట్లాడగానే అతను చేయగలడనే నమ్మకం వచ్చేసింది. ఇప్పటివరకు ఇంత  కామెడీ టైమింగ్ ఉన్న క్యారెక్టర్‌‌ చేయలేదు. యాక్షన్ కూడా స్టైలిష్‌‌గా ఉంటుంది. కామెడీ బేస్‌‌తో వస్తోన్న  యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. ఎన్‌‌ఐఏ ఏజెంట్‌‌ పాత్ర నాది. అలా అని ఏదో బోర్డర్‌‌‌‌లో జరిగే కథ కాదు. దేశం లోపల జరిగే  కథ. ప్రతి సీన్ ఎలా చేయాలనేది డైరెక్టర్‌‌‌‌తో డిస్కస్ చేశాకే కెమెరా ముందుకు వెళ్లేవాడిని. గన్ ఎలా పట్టుకోవాలి వంటి విషయాల్లో కూడా రీసెర్చ్  చేశాను.  టైటిల్‌‌ విషయంలో నేనే ఇన్వాల్వ్ అయ్యి ‘రాజా విక్రమార్క’ పెడదామన్నాను. మెగాస్టార్ టైటిల్ కనుక పాజిటివిటీ ఉంటుందని అభిమానిగా ఫీలయ్యాను. చిరంజీవి గారికి విషయం చెబితే ‘గుడ్ లక్’ అన్నారు. గత సినిమాల్లో జరిగిన మిస్టేక్స్ ఇందులో  రిపీట్ కాకుండా చూసుకున్నాను. ట్రెండ్ మారుతోంది. దాని ప్రకారం కథలు సెలెక్ట్ చేసుకోవాలి. నా ఫిజిక్ కూడా నాకు అడ్వాంటేజ్‌‌ అయ్యింది. ఫిజిక్ బాగున్నందుకే నన్ను తీసు కున్నామని మొదట్లో ముగ్గురు దర్శకులు అన్నారు. కానీ వాళ్లు నా నటన, నేను ఎమోషన్స్‌‌ని పండించిన విధానం చూసి సర్‌‌‌‌ప్రైజ్ అయ్యారు. ప్రస్తుతం యూవీ  క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌లో ఓ సినిమా చేస్తున్నాను.  క్లాక్స్ అనే యంగ్ డైరెక్టర్ తీస్తున్న మూవీలోనూ నటిస్తున్నాను. అలాగే  శ్రీదేవి మూవీస్ బ్యానర్‌‌‌‌లో ఓ సినిమాకి కమిటయ్యాను. ఇవన్నీ డిఫరెంట్ జానర్ సినిమాలే. ఇక తమిళంలో ‘వలిమై’ చేస్తున్నాను. అజిత్‌‌ లాంటి స్టార్‌‌‌‌తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. యాక్షన్‌‌ సీన్స్‌‌ ఓ రేంజ్‌‌లో ఉంటాయి. డిఫరెంట్ టేకింగ్. అజిత్‌‌ గారు రిస్కీ షాట్స్ చేయడం చూసి ఇన్‌‌స్పైర్ అయ్యి నేనూ చేయాలనుకున్నాను. కానీ ఆయనతో చేయడం కాస్త కష్టమే. ఓ సీన్‌‌లో నా కళ్లముందే ఆయనకి యాక్సిడెంట్‌‌ అయ్యింది. దాంతో భయమేసింది. అయినా కూడా నా  బెస్ట్ ఇవ్వడా నికి ప్రయత్నించా.’’