స్వలింగ సంపర్క వివాహాల సుప్రీం తీర్పు పై.. మంచు లక్ష్మి అసంతృప్తి

స్వలింగ సంపర్క వివాహాల సుప్రీం తీర్పు పై.. మంచు లక్ష్మి అసంతృప్తి

స్వలింగ వివాహాలపై సుప్రీం తీర్పుపై టాలీవుడ్​ నటి మంచు లక్ష్మి (ManchuLakshmi) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తరహా వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని ఇటీవల కోర్టు తన తీర్పులో వెల్లడించింది. అయితే, ఈ తీర్పు విని తన గుండెపగిలిందని మంచు లక్ష్మి పేర్కొంది. ఇలాంటి తీర్పును తాను ఊహించలేదని..తీవ్ర నిరాశకు గురయ్యానని ఆమె తెలిపింది.

ప్రపంచ దేశాలకు ప్రేమ గురించి బోధించిన మన దేశానికి ఇది నిజంగా అవమానమని చెప్పింది. ఇతర దేశాల్లో ఉన్న స్వలింగ సంపర్కులు స్వేచ్ఛగా జీవితాన్ని గడుపుతున్నారని..మన దేశంలో వీరి వివాహాలను అంగీకరించలేమా? అని ప్రశ్నించింది.

మ‌గ-మ‌గ, ఆడ‌-ఆడ పెళ్లి కుద‌ర‌ద‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్ట్ తీర్పు ప్రకటించగానే..ఇది కొంతమందికి రుచించ‌డం లేదు. ముఖ్యంగా పలువురు సెల‌బ్రిటీలు దీనిని ఖండిస్తున్నారు. తాజాగా మంచులక్ష్మి కామెంట్స్​ వైరలవుతున్నాయి.

అస‌లు సుప్రీంకోర్టు (SupremeCourt) ఏమని చెప్పిందంటే..

ఐదుగురు న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు బెంచ్ LGBTQIA+ జంటలకు వివాహానికి సంపూర్ణ హక్కు లేదని ప్రకటించింది.  అయితే ఈ తీర్పు క్వీర్ వ్యక్తులు ఎటువంటి సంబంధాలను ఏర్పరచుకోకుండా..నిరోధించదని కోర్టు తేల్చి చెప్పేసింది. అంతేకాకుండా అండర్-క్లాసిఫికేషన్ ఆధారం చేసుకుని..స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ (SMA)కి సవాల్ చేయడం ఎంతమాత్రం సబబు కాదని సుప్రీం కోర్టు పేర్కొంది. 

అంతేకాకుండా..ఒక మధ్యంతర పరిష్కారంలో నిర్దిష్ట పౌర సంఘాలను హక్కులను గుర్తించి, వాటికి వివాహానికి కోసం అవసరమైన సమానమైన హోదాను ఇవ్వకుండా, ప్రత్యేకమైన దత్తత ఫ్రేమ్‌వర్క్‌ను కూడా వెంటనే అమలు చేయాల‌నే సూచ‌న కూడా చేయ‌డం ఆస‌క్తిక‌రం.

అలాగే హిజ్రాల‌కు నెలకొన్న సమస్యల పరిష్కార మార్గానికి  రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంటు రెండూ ఒక కమిటీని ఏర్పాటు చేయాలని..వెంటనే అమల్లోకి తీసుకురావాలని సాయి దీపక్ అనే లాయ‌ర్ ప్రతిపాదించారు.