
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్ (హెచ్‌పీఎల్)తో టాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్ దాస్యం తరుణ్ భాస్కర్ జట్టు కట్టాడు. ఈ లీగ్‌లో పాల్గొంటున్న ‘ది రాప్టర్స్' టీమ్‌లో కో–-ఓనర్‌గా చేరాడు.. ఆర్బిట్ ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్ కో -ఫౌండర్స్ అయిన కౌశిక్ మానేపల్లి, దివ్య ప్రియాంక రెడ్డితో కలిసి తరుణ్ భాస్కర్ యాజమాన్య బృందంలో భాగమయ్యాడు.
ఇండియాలోనే తొలి ప్రొఫెషనల్ హైపర్–-లోకల్ పికల్‌బాల్ లీగ్ అయిన హెచ్‌పీఎల్‌లో పోటీపడుతున్న ఎనిమిది ఫ్రాంచైజీల్లో ది రాప్టర్స్ టీమ్ ఒకటి. శుక్రవారం అధికారికంగా మొదలైన ఈ లీగ్‌లో రాప్టర్స్ సత్తా చాటుతుందని తరుణ్ భాస్కర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు.