
టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటీవల వచ్చిన మేజర్ సినిమాతో ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన శేష్.. ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. నిజం చెప్పాలంటే శేష్ సినిమాలకు, అతని నటనకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. ఆయన సెలెక్ట్ చేసుకునే కథలు అదే లెవల్లో ఉంటాయి.
అయితే.. తాజాగా అడివి శేష్ గురించి ఆసక్తికరమైన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అదేంటంటే.. అడివి శేష్ ఒరిజినల్ పేరు పేరు కాదట. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నా ఒరిజినల్ పేరు సన్నీ చంద్ర. అమెరికాలో ఉన్నప్పుడు నన్ను అందరూ ఏడిపించేవారు. ఎందుకంటే.. అమెరికాలో ఆరెంజ్ ఫ్లేవర్లో సన్నీ డిలైట్ జ్యూస్ ఉండేది, అదే టైంలో సన్నీలియోన్ కూడా చాలా ఫేమస్. అలా నన్ను అందరూ సన్నీ, సన్నీ.. అని ఏడిపించేవారు.
అదే విషయాన్నీ మా డాడీకి చెప్తే.. ఆయన శేష్ అనే పేరు వాడుకో అని చెప్పారు. ఎందుకు అని డాడీని అడిగితే.. నాకు క్రికెటర్ సునీల్ గవాస్కర్ అంటే ఇష్టం అని నీకు సన్నీ అని పేరు పెట్టాను. కానీ, పూజారి మాత్రం శ అనే అక్షరంతో పేరు ఉండాలి అని సూచించారు. అందుకే నీ పేరు శేష్ కూడా. ఇక నుండి ఆ పేరు వాడుకో అని చెప్పారు. అలా నా పేరు సన్నీ చంద్ర నుండి శేష్ గా మారింది.. అంటూ చెప్పుకొచ్చారు శేష్. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన హీరోయిన్ శృతి హాసన్ తో డెకాయిట్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.