ఘనంగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫొటోస్

ఘనంగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫొటోస్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేశ ‍బాబు రెండో తనయుడు అభిరామ్ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరో రానాకు తమ్ముడైన అభిరామ్ తన మరదలు ప్రత్యూషను పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుక శ్రీలంకలో జరిగింది. ఎంతో ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాల బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం అభిరామ్ పెళ్ళికి సంబంధించిన  పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్.  

ఇక అభిరామ్ విషయానికి వస్తే.. ఇటీవలే ఆయన అహింసా అనే సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది. అప్పటినుండి మరో సినిమాను మొదలుపెట్టని అభిరామ్ సడన్ గా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.