గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న హీరో శర్వానంద్?

గుడ్ న్యూస్..  తండ్రి కాబోతున్న హీరో శర్వానంద్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా శుభవార్తలు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్(Ram charan) ఉపాసన(Upasana)కు కూతురు పుట్టగా.. రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun tej) లావణ్య త్రిపాఠి(Lavanya tripathi)లో పెళ్లి జరిగింది. ఇక తాజాగా టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఆయన తండ్రి కాబోతున్నారని తెలుస్తోంది. జూన్ నెలలో శర్వానంద్ రక్షితా రెడ్డి(Rakshitha reddy) వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జంట తన మొదటి సంతానానికి వెల్ కమ్ చెప్పడానికి సిద్ధమయ్యారట. ప్రస్తుతం భార్యతో కలిసి అమెరికాలో ఉన్న శర్వానంద్.. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నారట. ఈ శుభవార్త తెలుసుకున్న ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ హేషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.