తెలుగు హీరోస్.. కథల కోసం కసరత్తులు.. అంత అభిమానుల కోసమే

తెలుగు హీరోస్.. కథల కోసం కసరత్తులు.. అంత అభిమానుల కోసమే

కథ..స్క్రీన్ ప్లే..దర్శకత్వం చేసే క్రియేటర్స్..వాళ్ళ మైండ్కు పెట్టె పదును వెనుక ఎన్నో రాత్రుల కృషి, ఎన్నో రోజుల ఓపిక ఆధారపడి ఉంటుంది. కానీ వీళ్ళు బయట ప్రపంచానికి అస్సలు కనిపించరు. కానీ, వీరు పడ్డ శ్రమంత..సినిమా రూపంలో కనిపిస్తోంది. మరి క్రియేటర్స్ శ్రమకు..ప్రతి ఫలం దక్కాలంటే..దానికి మార్గం హీరోస్ మేకోవర్, డైలాగ్స్, యాక్టింగ్..ఇవన్నీ తోడై ఉండాలి. ఇప్పుడు అలాంటి పనిలోనే చాలా మంది హీరోస్..తమ తమ ప్రాజెక్ట్స్ కోసం జిమ్లో కసరత్తులు చేస్తూ..కొంతమంది హీరోస్ అయితే, ఏకంగా విదేశాలకు వెళ్లి ట్రైనింగ్ తీసుకోవడం చేస్తున్నారు. 

లేటెస్ట్గా హీరో నాగ చైతన్య (Naga Chaitanya) కార్తికేయ ఫేమ్ డైరెక్టర్ చందు మొండేటితో కలిసి కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీ సముద్రం బ్యాక్ డ్రాప్లో రాబోతుండగా..మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తిగా నాగచైతన్య కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం అతడు తన లుక్ను మార్చుకుంటున్నాడనే  విషయాన్ని..తన లేటెస్ట్ లుక్స్..జిమ్లో కసరత్తులు చేసే.. వీడియో ద్వారా చెప్పేసాడు చై. 

ఈ మూవీ శ్రీకాకుళం నుండి గుజరాత్కు వలస వెళ్లే మత్స్యకారుల కుటుంబాల నేపథ్యంలో స్టోరీ ఉంటుందని సమాచారం. తండేల్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ మూవీలో చైతు బోటు డ్రైవర్ పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. 

హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddhartha) స్వయంభూ సినిమా కోసం వియత్నాంలో నెల రోజులు స్పెషల్ ట్రైనింగ్‌‌ తీసుకుంటున్నాడు. అక్కడ  ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. సైగాన్‌‌లోని కొంతమంది బిగ్గెస్ట్ స్టంట్ మాస్టర్‌‌లు యాక్షన్ సీక్వెన్స్‌‌ల కోసం నిఖిల్‌‌కి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో తను ఒక యోధునిగా కనిపించడం కోసం ఫిజికల్‌‌గానూ మేకోవర్ అవుతున్నాడు.

అంతకుముందు..హీరో రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఇలానే జిమ్ లో చెమటోడ్చారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీలో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ కోసం ఈ హీరోస్ చాలా కష్టపడి మంచి ఫిజిక్ ను సొంతం చేసుకున్నారు.

ఇక మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీ కోసం,మహేష్ బాబు గుంటూరు కారం, వరుణ్ తేజ్ గని, గాండీవధారి అర్జున సినిమాల కోసం జిమ్ లో బాగానే కష్టపడ్డారు. ఇలా డైరెక్టర్స్ రాసే కథల్లోని క్యారెక్టర్ కోసం మన టాలీవుడ్ హీరోలు అదనంగా కష్టపడ్డానికి ఏమాత్రం అస్సలు వెనకాడ్డం లేదు. దీంతో కొన్నిసార్లు ఎంత కష్టపడ్డ..ఆ మూవీస్ హిట్ అవ్వొచ్చు..కాకపోవొచ్చు. కానీ, తెలుగు ఆడియన్స్ ను అలరించడానికి ఎప్పటికప్పుడు తమ మేకోవర్స్ కోసం కృషి చేస్తూనే ఉంటారు.