గత కొన్ని రోజులుగా టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ట్వీట్లు చేస్తూ సంచలనంగా మారింది. అయితే మొన్నటికి మొన్న టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఉద్దేశించి చేసిన ట్వీట్ ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ట్వీట్ ని మరువకముందే మరోసారి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
పూనమ్ కౌర్ "ఓ ప్రముఖ దర్శకుడు అమ్మాయిని గర్భవతి చేసి చివరికి అబార్షన్ చేయించారని దీంతో ఆ నటి సినీ కెరియర్ పూర్తీగా నాశనం అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఇది చేసింది రాజకీయ నాయకుడిగా మారిన నటుడు కాదని క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) నుంచి సహాయం పంజాబీ అమ్మాయికి సహాయం అందిందని కానీ తమకి సంబంధం లేని ఈ విషయంలోకి అనవసరంగా తనని మరియు ఓ రాజకీయ నాయకుడిని లాగి ప్రచారం చేశారని ట్వీట్ లో పేర్కొంది. అయితే ఇందులో సినీ ప్రముఖుల పేర్లు మాత్రం ప్రస్తావించలేదు.
clarification -
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 9, 2024
it’s not the actor turned politician who impregnated n aborted the girl which ended her career - it’s the director who did it -maa involvement helped the half punjabi actor , I and actor/politician were pulled unnecessarily due political desperation #punjabigirl.
దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు ఈ ట్వీట్ పై స్పందిస్తూ ఈ మధ్య కాలంలో మీటూ ఉద్యమంపై అందరికీ అవగాహన పెరిగిందని దీంతో భాదితులు ధైర్యంగా ముందుకు వచ్చి స్పందిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ | మనీలాండరింగ్ కేసులో కోర్టుని ఆశ్రయించిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులు.
అలాగే డైరెక్టర్ మరియు నటుల పేర్లు కూడా తెలియేజయాలని, ఇలా ఊరు, పేర్లు తెలియజేయకుండా ట్వీట్ చేయడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదని మరికొందరు అంటున్నారు. ఏదేమైనప్పటికీ పూనమ్ కౌర్ మాత్రం గతంలో జరిగిన సంఘటనలని మళ్ళీ సోషల్ మీడియాలో లేవనెత్తుతోంది. దీంతో ఎప్పుడు ఎవరి పేరు బయటికొస్తుందోనని మరికొందరు భయపడుతున్నారు.