మెగా హీరోతో టాలీవుడ్ హీరోయిన్ రిలేషన్..క్లారిటీ ఇచ్చిన వైష్ణవ్

మెగా హీరోతో టాలీవుడ్ హీరోయిన్ రిలేషన్..క్లారిటీ ఇచ్చిన వైష్ణవ్

మెగా వరుణ్ తేజ్..లావణ్యల..'లవ్..పెళ్లి..రిసెప్షన్' ఇలా ఓ తతంగం అంత సంవత్సరం పాటు కొనసాగింది. సోషల్ మీడియాలో ఇదంతా ముగిసే సరికి ఏడాది సమయం పట్టింది. ఇక మరో న్యూస్ కోసం ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్కు..ఆ సమయం రానే వచ్చింది.

అసలు విషయానికి వస్తే..వరుణ్..లావణ్య పెళ్లికి సంబంధించిన పలు వేడుకల్లో మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు..హీరోయిన్ రీతూవర్మ(Ritu Varma) సైతం పాల్గొన్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌ ఇచ్చిన ప్రీ వెడ్డింగ్ పార్టీలో రీతూవర్మ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది. ప్రస్తుతం ఈ పార్టీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఓ మెగా హీరోతో రీతూ రిలేషన్ లో ఉన్నట్లు నెటిజన్స్ నుంచి కామెంట్స్ ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఆదికేశవ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్న వైష్ణవ్ తేజ్(Vaishnav Tej)..ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై స్పందించారు. లావణ్య త్రిపాఠికి రీతూ మంచి ఫ్రెండ్.. ఆ కారణంతోనే ఆమె పెళ్లి వేడుకల్లో సందడి చేసిందన్నారు. అంతకు మించి ఏమీ లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు. 

శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఆదికేశవ మూవీతో వైష్ణవ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇందులో శ్రీలీల (Sree Leela) హీరోయిన్‌ గా నటిస్తోంది. మలయాళ నటుడు జోజు జార్జ్‌, అపర్ణా దాస్‌, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వస్తోన్న ఈ మూవీ ఎట్టకేలకు నవంబర్‌ 24న విడుదల కానుంది.