చిన్న చిత్రాలను తొక్కేస్తున్న టాలీవుడ్ మాఫియా: నిర్మాత షెరాజ్ మెహదీ

చిన్న చిత్రాలను తొక్కేస్తున్న టాలీవుడ్ మాఫియా: నిర్మాత షెరాజ్ మెహదీ

చిన్న సినిమాలను ఇండస్ట్రీలోని మాఫియా చంపేస్తోందని  నటుడు నిర్మాత షెరాజ్ మెహదీ ఆరోపించారు. తన ‘ఓ అందాల రాక్షసి’ రీ -రిలీజ్‌‌‌‌కు కూడా థియేటర్లు ఇవ్వలేదని చెబుతూ.. నైజాం ప్రాంతంలో ఒక్క థియేటర్ కూడా దొరకలేదని, ఈ విషయంపై లీగల్‌‌‌‌గా పోరాటం ప్రారంభించానని అన్నారు.  ఇండస్ట్రీ పెద్దలు, డిస్ట్రిబ్యూషన్ సిండికేట్లు చిన్న సినిమాలను అణగదొక్కుతున్నాయని విమర్శించారు. చిన్న సినిమాలే వేలాది మందికి ఉపాధి కల్పిస్తాయని, వాటికి అవకాశాలు లేకపోతే కొత్త ప్రతిభ రాదని అన్నారు. ప్రభుత్వం, మీడియా, ఇండస్ట్రీ కలిసి చిన్న సినిమాలకు మద్దతు ఇవ్వాలని కోరారు.