
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి సందడి చేశారు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో నాని తెలుగు కామెంటరీగా కనిపించగా, హిందీ కామెంటరీలో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని, సల్మాన్ ఖాన్ కలిసి దిగిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే నాని నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం డిసెంబర్ 7న విడుదల కానుండగా, సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.